సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Oke oka jeevitham: నడవకపోటానికి 5 కారణాలివే! ;

ABN, First Publish Date - 2022-09-15T18:11:12+05:30

శర్వానంద్‌, రీతూ వర్మ, వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి, అమల నటించిన ‘ఒకే ఒక జీవితం’ గత వారం విడుదలైంది. అయితే ఈ సినిమాకి మంచి పాజిటివ్‌ టాక్‌ వున్నా బాక్స్‌ ఆఫీస్‌ దగ్గర నిలవలేకపోయింది. కలెక్షన్స్‌ చెప్పుకోదగ్గట్టుగా లేవు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శర్వానంద్‌(Sharwanand), రీతూ వర్మ, వెన్నెల కిశోర్‌, ప్రియదర్శి, అమల నటించిన ‘ఒకే ఒక జీవితం’ (Oke oka jeevitham)గత వారం విడుదలైంది. అయితే ఈ సినిమాకి మంచి పాజిటివ్‌ టాక్‌ వున్నా బాక్స్‌ ఆఫీస్‌ దగ్గర నిలవలేకపోయింది. కలెక్షన్స్‌ చెప్పుకోదగ్గట్టుగా లేవు. ఈ సినిమా డబ్బులు వసూలు చెయ్యకపోవటానికి ఒక అయిదు కారణాలు చెబుతున్నారు. సినిమా అంత బాగా తీశామని, ఎమోషనల్‌ డ్రామా అని సినిమాలో పనిచేసిన నటులు, దర్శక నిర్మాతలు నమ్మినపుడు ఆ సినిమాకి ప్రమోషన్స్‌ కూడా అదే రేంజ్‌ లో చెయ్యాల్సి ఉంది. కానీ ఈ సినిమా నిర్వాహకులు మొత్తం ఆ విషయంలో ఫెయిల్‌ అయ్యారు. హైదరాబాద్‌లో కూర్చొని ప్రెస్‌ మీట్‌, సక్సెస్‌ మీట్‌లు పెడితే అది టీవీ వాళ్లకి పనికొస్తుంది కానీ ప్రేక్షకులకి కాదు. ఇది మొదటి కారణం. సినిమా మొదటి సగంలో చాలా సన్నివేశాలు సాగదీతగా ఉన్నాయి. శర్వానంద్‌ పాట పాడటానికి సమాయత్తం అవటం లాంటివి బాగా సాగదీశారు. ఇది రెండో కారణం. ఇప్పుడు థియేటర్స్‌కి ప్రేక్షకులు రావటం లేదు, ఆ సినిమాలో కంటెంట్‌ చాలా బాగుంటే వస్తున్నారు. శర్వానంద్‌ సినిమా అనగానే ఓటీటీలో చూడొచ్చు అని ప్రేక్షకుడు అనుకోవడమే. ఇది మూడో కారణం. ఇంక నాలుగో కారణం ఈ సినిమా రాంగ్‌ తేదీన విడుదల అవటం. విడుదల అయినా రోజు గణేష్‌ నిమజ్జననం అని తెలిసి కూడా ఆరోజు విడుదల చేశారు. దీనివల్ల ఈ సినిమాకి అసలు ఓపెనింగ్స్‌ రాలేదు. రెండో రోజు కూడా ప్రేక్షకులు అదే మూడ్‌లో ఉండటం వల్ల రెండో రోజు కూడా అంతంత  మాత్రం గానే కలెక్షన్స్‌ వచ్చాయి. చిత్ర యూనిట్‌ సక్సెస్‌ మీట్‌ ఎదో పెట్టాలి కాబట్టి అది కూడా హైదరాబాద్‌ లోనే పెట్టేసి ఊరుకున్నారు. ఇతర సిటీస్‌ కూడా తిరిగితే బాగుండేది. శర్వానంద్‌ ఈ సినిమాని అంత నమ్మినపుడు ప్రమోషన్స్‌కి ఎక్కువ రోజులు కేటాయించాల్సింది. సినిమాలో బాగా నటిేస్త సరిపోదు, ప్రమోషన్స్‌ కి అన్ని ఊర్లు తిరగాలి, కానీ ఆ పని చెయ్యలేదు. ఇంక ఐదో కారణం హిందీ సినిమా బ్రహ్మాస్త్ర కూడా అదే రోజున విడుదల అవటం. ఆ సినిమాని  రాజమౌళి భుజాన వేసుకొని ప్రమోషన్స్‌ చెయ్యడం వల్ల దానికి బాగా ఓపెనింగ్స్‌ వచ్చాయి.  ఒకే ఒక జీవితం సినిమా కలెక్షన్స్‌ కూడా ఆ సినిమా కొట్టేసింది.  ఈ అయిదు కారణాల వల్ల ఒకే ఒక జీవితం బాగున్నా కూడా డబ్బులు రాబట్టలేకపోయింది.


Updated Date - 2022-09-15T18:11:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!