ప్రేమికుల రోజున ఫస్ట్‌ సింగిల్‌

ABN , First Publish Date - 2022-01-27T05:41:31+05:30 IST

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తిసురేష్‌ కథానాయిక. పరుశురామ్‌ దర్శకుడు...

ప్రేమికుల రోజున ఫస్ట్‌ సింగిల్‌

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తిసురేష్‌ కథానాయిక. పరుశురామ్‌ దర్శకుడు. ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం నాడు మహేష్‌బాబు అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది చిత్రయూనిట్‌. ఫిబ్రవరి 14న ‘సర్కారు...’ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ చే సి, మ్యూజిక్‌ ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపింది. తమన్‌ స్వరకల్పనలో మహేష్‌బాబు, కీర్తి సురేష్‌ల మీద చిత్రీకరించిన ఈ రొమాంటిక్‌ గీతం మెలోడీ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉందని చిత్రబృందం తెలిపింది. వేసవిలో ‘సర్కారు...’ ప్రేక్షకుల ముందుకు రానుంది. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు.


Updated Date - 2022-01-27T05:41:31+05:30 IST