ఫస్ట్‌ లుక్‌ రెడీ

ABN , First Publish Date - 2022-11-15T06:01:35+05:30 IST

‘తగ్గేదే లే..’ అంటూ ‘పుష్ప’లో తన తడాఖా చూపించేశారు అల్లు అర్జున్‌. ఇప్పుడు ఈ చిత్రానికి రెండో భాగం తయారవుతోంది...

ఫస్ట్‌ లుక్‌ రెడీ

‘తగ్గేదే లే..’ అంటూ ‘పుష్ప’లో తన తడాఖా చూపించేశారు అల్లు అర్జున్‌. ఇప్పుడు ఈ చిత్రానికి రెండో భాగం తయారవుతోంది. ఈనెలలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలెడతారు. అయితే అంతకంటే ముందే ‘పుష్ప 2’కి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ విడుదల కానుంది. త్వరలోనే పుష్పరాజ్‌ అవతార్‌ని అభిమానులకు చూపించబోతున్నార్ట సుకుమార్‌. అందుకు సంబంధించిన ఫొటో షూట్‌ కూడా పూర్తయిందని సమాచారం. అంతే కాదు.. ‘పుష్ప 2’ గ్లిమ్స్‌ కూడా రెడీ చేస్తున్నారని సమాచారం. ‘అవతార్‌ 2’ చిత్రం డిసెంబరు 16న విడుదల కాబోతోంది. ‘అవతార్‌’ ప్రదర్శించే అన్ని థియేటర్లలోనూ ‘పుష్ప 2’ గ్లిమ్స్‌ చూసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ సినిమా లొకేషన్ల వేటలో దర్శకుడు సుకుమార్‌ బిజీగా ఉన్నారు. బ్యాంకాక్‌లోని అడవుల్లో కొంతమేర షూటింగ్‌ చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాకోసం కోకాపేటలో కొత్తగా తీర్చిదిద్దిన అల్లూ స్డూడియోలో ప్రత్యేకంగా సెట్‌ రూపొందిస్తున్నారు. అందులోనే సింహభాగం షూటింగ్‌ జరగబోతోందని టాక్‌. 


Updated Date - 2022-11-15T06:01:35+05:30 IST

Read more