బి.ఎ.రాజుకు చిత్రపరిశ్రమ నివాళి

ABN , First Publish Date - 2022-05-12T09:44:59+05:30 IST

సీనియర్‌ జర్నలిస్ట్‌, నిర్మాత బి.ఎ.రాజు అనారోగ్యం కారణంగా కన్నుమూసి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రథమ వర్థంతిని ఆయన కుటుంబ సభ్యులు...

బి.ఎ.రాజుకు చిత్రపరిశ్రమ నివాళి

సీనియర్‌ జర్నలిస్ట్‌, నిర్మాత బి.ఎ.రాజు అనారోగ్యం కారణంగా కన్నుమూసి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రథమ వర్థంతిని ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిశేషగిరిరావు,  ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సి.కల్యాణ్‌, తమ్మారెడ్డి భరద్వాజ, ఎమ్మెస్‌ రాజు, బండ్ల గణేశ్‌, ఫిల్మ్‌ జర్నలిస్టు కుటుంబాలు హాజరయ్యాయి. తెలుగు చిత్రపరిశ్రమతో బి.ఎ.రాజుకు ఉన్న అనుబంధాన్ని, పాత్రికేయుడిగా ఆయన నిబద్ధతను ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకున్నారు. బి.ఎ.రాజు పేరుతో ప్రతి ఏడాది ఏదన్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తే, దానికి తనవంతు సాయం అందిస్తానని సి.కల్యాణ్‌ ప్రకటించారు. 

Updated Date - 2022-05-12T09:44:59+05:30 IST

Read more