సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

TFI: మరో సమావేశం ముగిసింది!

ABN, First Publish Date - 2022-08-08T00:11:28+05:30

కరోనా, టికెట్‌ ధరలు పెంచడం, తగ్గించడం, బడ్జెట్‌ తదితర సమస్యలతో తెలుగు చిత్ర పరిశ్రమ షెడ్‌కి వెళ్లే పరిస్థితి వచ్చిన సంగతి తెలిసిందే! రానురాను పరిశ్రమకు మనుగడ లేకుండా పోతుండేమో అన్న భయం ఇప్పటికి పుట్టుకొచ్చింది పరిశ్రమ వర్గాలకు. అందుకే షూటింగ్‌లు ఆపి మరీ పరిశ్రమకు రిపేర్లు మొదలుపెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా, టికెట్‌ ధరలు పెంచడం, తగ్గించడం, బడ్జెట్‌ తదితర సమస్యలతో తెలుగు చిత్ర పరిశ్రమ (TFI) షెడ్‌కి వెళ్లే పరిస్థితి వచ్చిన సంగతి తెలిసిందే! రానురాను పరిశ్రమకు మనుగడ లేకుండా పోతుండేమో అన్న భయం ఇప్పటికి పుట్టుకొచ్చింది పరిశ్రమ వర్గాలకు. అందుకే షూటింగ్‌లు ఆపి మరీ పరిశ్రమకు రిపేర్లు మొదలుపెట్టారు.  ఫిల్మ్‌ చాంబర్‌(Film chamber), నిర్మాత మండలి(Producers council), ‘మా’ అసోసియేషన్‌(MAA), ప్రత్యేక కమిటీలు ఇలా అంతా కలిసి రోజుకో సమస్యపై ఆయా ప్రతినిధులను పిలిచి చర్చలు జరుపుతున్నారు. 


గత సోమవారం నుంచి ఇప్పటి వరకూ చాలా సమస్యలపై చర్చలు జరిపారు. పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమైంది. తెలుగు రాష్ట్రాల్లోని కీలకమైన డిస్ట్రిబ్యూటర్లు తమ సమస్యల్ని ఛాంబర్‌ ముందుంచారు. థియేటర్‌లలో రెవెన్యూ వాటాలు, వీపీఎఫ్‌ ఛార్జీలపై చర్చించారు. అయితే నేటి చర్చల్లో సమస్యలకు పరిష్కారం దొరికినట్లు లేదని సమాచారం. అందుకే ఈ నెల 16న మరోసారి ఢిస్ట్రిబ్యూటర్లతో సమావేశం జరగనుంది. 


Updated Date - 2022-08-08T00:11:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!