సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Paga Paga Paga: హీరో అవుతున్న శిష్యుడికి.. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ సపోర్ట్

ABN, First Publish Date - 2022-08-09T01:33:32+05:30

సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష సుంకర (Abhilasha Sunkara), దీపిక ఆరాధ్య (Deepika Aradhya) హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పగ పగ పగ’ (Paga Paga Paga). వినోదాత్మకంగా కొనసాగే క్రైమ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష సుంకర (Abhilasha Sunkara), దీపిక ఆరాధ్య (Deepika Aradhya) హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పగ పగ పగ’ (Paga Paga Paga). వినోదాత్మకంగా కొనసాగే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా  డైరెక్టర్ రవి శ్రీ దుర్గా ప్రసాద్ (Ravi Sri Durga Prasad) రూపొందిస్తున్న  ఈచిత్రాన్ని నిర్మాత సత్య నారాయణ సుంకర (Satya Narayana Sunkara) భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ (Fight Masters Ram Laxman) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. పోస్టర్ విడుదల అనంతరం రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మాట్లాడుతూ.. ‘‘మా దగ్గర ఎన్నో సినిమాలకు పని చేసిన అభిలాష్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. టాలెంట్ ఉన్న వ్యక్తి. అందుకే ప్రోత్సహించాం. ఇప్పుడు హీరో అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము..’’ అని తెలిపారు.


మోషన్ పోస్టర్ విషయానికి వస్తే.. ఇందులో తెలుగులో వచ్చిన రివేంజ్ స్టోరీలను చూపించారు. ‘బొబ్బిలి పులి, ఖైదీ, కటకటాల రుద్రయ్య, పగ సాధిస్తా’ సినిమాలలోని డైలాగ్స్, పగ గురించి చెప్పిన ఎమోషన్స్‌ను చూపించారు. ‘పగ’కున్న ఇంపార్టెన్స్‌ని ఈ మోషన్ పోస్టర్‌లో చూపించారు. బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు వంటి వారు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కోటి సంగీతం అందిస్తున్నారు. కాగా, ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరాయని, త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. (Paga Paga Paga Motion Poster) 



Updated Date - 2022-08-09T01:33:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!