ఇది కదా పండగంటే.. ‘ఎఫ్ 3’ పోస్టర్ అదిరింది!

ABN , First Publish Date - 2022-04-03T02:13:07+05:30 IST

పండగంటే పది మంది ఒక చోట చేరి సందడి చేయడం. అటువంటి సందడికి మా చిత్రంలో లోటు ఉండదని తెలిపేలా.. ‘ఉగాది’ పండుగను పురస్కరించుకుని ‘ఎఫ్ 3’ టీమ్ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ప్రతి ఒక్కరికీ తెలుగు నూతన సంవత్సర..

ఇది కదా పండగంటే.. ‘ఎఫ్ 3’ పోస్టర్ అదిరింది!

పండగంటే పది మంది ఒక చోట చేరి సందడి చేయడం. అటువంటి సందడికి మా చిత్రంలో లోటు ఉండదని తెలిపేలా.. ‘ఉగాది’ పండుగను పురస్కరించుకుని ‘ఎఫ్ 3’ టీమ్ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ప్రతి ఒక్కరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని తెలుపుతూ.. సినిమాలోని ప్రధాన తారాగణంతో కూడిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఎఫ్‌2’లో ‘భార్య బాధితులు’గా కనిపించిన వెంకటేష్, వరుణ్ తేజ్.. ఈ పోస్టర్‌లో చేతిలో మెగాఫోన్‌లు పట్టుకుని వారిని భయపెట్టడం ఆసక్తిని సంతరించుకుంది. రాజేంద్ర ప్రసాద్.. వెంకటేష్, వరుణ్ తేజ్‌తో ఉండగా, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా, సోనాల్ చౌహాన్, సునీల్, వెన్నెల కిషోర్ మరియు ఇతరులు మరొక వైపు ఉన్నారు. పోస్టర్‌లో పండగ వాతావరణం కనబడుతోంది. మే 27న థియేటర్లలో నవ్వుల హంగామా చేయడానికి ‘ఎఫ్3’ కుటుంబం సిద్ధంగా ఉన్నట్లుగా ఈ పోస్టర్‌తో తెలిసిపోతోంది.


అపజయం ఎరుగని దర్శకుడిగా పేరున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘ఎఫ్ 3’ చిత్రం రూపొందింది. మొదటి పాటతో పాటు ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్‌ మంచి స్పందన రాబట్టుకున్న విషయం తెలిసిందే. దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Updated Date - 2022-04-03T02:13:07+05:30 IST

Read more