ఎఫ్‌ 3 అదిరిపోతుంది

ABN , First Publish Date - 2022-05-23T05:37:01+05:30 IST

‘‘మూడేళ్ల తర్వాత ‘ఎఫ్‌ 3’ రూపంలో నా సినిమా థియేటర్‌లోకి వస్తోంది. ప్రేక్షకులంతా తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి మంచి...

ఎఫ్‌ 3 అదిరిపోతుంది

‘‘మూడేళ్ల తర్వాత ‘ఎఫ్‌ 3’ రూపంలో నా సినిమా థియేటర్‌లోకి వస్తోంది. ప్రేక్షకులంతా తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి మంచి స్ర్కిప్ట్‌ అందించారు. వరుణ్‌తేజ్‌ అద్భుతంగా నటించాడు. ‘ఎఫ్‌ 3’ అదిరిపోతుంది’’ అని వెంకటేష్‌ అన్నారు. ఈ చిత్రం ఈనెల 27న విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో సునీల్‌ గారితో నా కాంబినేషన్‌ బాగా వచ్చింది. ‘ఎఫ్‌ 3’తో దిల్‌రాజు గారి ప్రొడక్షన్‌లో హ్యాట్రిక్‌ కొడతాను. వెంకటేష్‌ గారితో రెండోసారి చేసే అదృష్టం నాకు దక్కింద’న్నారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘కరోనా తర్వాత ప్రేక్షకులను బాగా నవ్వించాలని చాలా కష్టపడ్డాం. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కామెడీ టైమింగ్‌ అలరిస్తుంది’ అని చెప్పారు. చిత్ర సమర్పకుడు దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఎఫ్‌ 2’ కంటే గొప్పగా ప్రేక్షకులు ‘ఎఫ్‌ 3’ని ఎంజాయ్‌ చేస్తారు. దేవి శ్రీ ప్రసాద్‌ అద్భుతమైన సంగీతం అందించార’న్నారు. సినిమా ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతుందని మెహరీన్‌ అన్నారు. ఎఫ్‌ 3లో పాత్రలన్నీ నవ్వులు పంచుతాయని రాజేంద్రప్రసాద్‌ చెప్పారు. 


Updated Date - 2022-05-23T05:37:01+05:30 IST

Read more