రేడియోతో ప్రయోగం!

ABN , First Publish Date - 2022-06-16T05:36:59+05:30 IST

సుమంత్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అహాం రీబూట్‌’’ షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది....

రేడియోతో ప్రయోగం!

సుమంత్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అహాం రీబూట్‌’’ షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ఫస్ట్‌ గ్లిట్స్‌ (ఫస్ట్‌ గ్లింప్స్‌)ను హీరో అడివి శేష్‌ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. ‘మీ ఆలోచనలు కూడా ప్రసారం అవుతాయి’ అని రేడియో సృష్టికర్త మార్కొని చెప్పిన కొటేషన్‌తో ఫస్ట్‌ గ్లిట్స్‌ మొదలైంది. ఇందులో సుమంత్‌ ఆర్జే నిలయ్‌ పాత్రను పోషించారు. ‘కొంతమంది నన్ను కిడ్నాప్‌ చేశారు. కాపాడండి’ అంటూ ఓ యువతి నిలయ్‌కు ఫోన్‌ చేస్తుంది. ఇలాగే ప్రమాదంలో ఉన్న చాలామంది యువతులు అతని సాయాన్ని రేడియో ద్వారా కోరుతుంటారు. మరి వాళ్లను అతను ఏ విధంగా కాపాడాడు.. అన్నది ఆసక్తికరం. ఈ ప్రయోగాత్మక చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందనీ, జులైలో విడుదల చేస్తామనీ చిత్రబృందం ప్రకటించింది. ప్రశాంత్‌సాగర్‌ అట్లూరి దర్శకత్వంలో రఘువీర్‌ గోరిపర్తి, సృజన్‌ యరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. 

Updated Date - 2022-06-16T05:36:59+05:30 IST

Read more