ఊహించని మలుపులతో ఉత్కంఠగా...

ABN , First Publish Date - 2022-06-01T11:23:29+05:30 IST

శ్రీసింహ కోడూరి, ప్రీతి అస్రాణి జంటగా నటించిన చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. సముద్రఖని కీలకపాత్ర పోషించారు...

ఊహించని మలుపులతో ఉత్కంఠగా...

శ్రీసింహ కోడూరి, ప్రీతి అస్రాణి జంటగా నటించిన చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. సముద్రఖని కీలకపాత్ర పోషించారు. సతీష్‌ త్రిపుర దర్శకత్వంలో డి. సురేష్‌ బాబు, సునీత తాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని సింగిల్‌ లొకేషన్‌లో షూట్‌ చేశాం. ‘దొంగలున్నారు జాగ్రత్త’ తెలుగులో తొలి సర్వైవల్‌ థ్రిల్లర్‌’ అని మేకర్స్‌ తెలిపారు. ‘ఒక చోరీ చేశాక...ఆ దొంగ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. సినిమా ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా ఉంటుంద’ని చిత్ర దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ: యశ్వంత సి. 


Updated Date - 2022-06-01T11:23:29+05:30 IST

Read more