సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రామ్‌చరణ్‌కు పెళ్ళైంది కాబట్టి ఆ ఛాన్స్ లేదు : Manushi Chillar

ABN, First Publish Date - 2022-06-02T16:55:55+05:30

టాలీవుడ్ స్టార్స్.. పాన్ ఇండియా స్టార్స్ అయిన తర్వాత జాతీయ స్థాయిలో వారి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అక్కడి స్టార్ హీరోయిన్స్ బాలీవుడ్ స్టార్స్ తో సమానంగా టాలీవుడ్ స్టార్స్‌తో ఆన్ స్ర్కీన్ రొమాన్స్‌కు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లార్ (Manushi Chillar).. రామ్ చరణ్‌ (Ramcharan) పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ స్టార్స్.. పాన్ ఇండియా స్టార్స్ అయిన తర్వాత జాతీయ స్థాయిలో వారి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అక్కడి స్టార్ హీరోయిన్స్ బాలీవుడ్ స్టార్స్ తో సమానంగా టాలీవుడ్ స్టార్స్‌తో ఆన్ స్ర్కీన్ రొమాన్స్‌కు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా  మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లార్ (Manushi Chillar).. రామ్ చరణ్‌ (Ramcharan) పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అందులో చెర్రీ చేసిన అల్లూరి సీతారామరాజు పాత్రను నార్త్ ఇండియన్స్ నిజంగా రాముడుగా భావించి.. అతడ్ని ఎంతగానో అభిమానిస్తున్నారు. 2017 మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ మానుషీ చిల్లార్.. ఇప్పుడు రామ్ చరణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి మరోసారి తన అభిమానాన్ని చాటుకుంది.


అక్షయ్ కుమార్ (Akshay Kumar) హీరోగా నటించిన చారిత్రక చిత్రం ‘పృధ్విరాజ్’ (Pridhwiraj) లో మానుషీ చిల్లార్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో.. మానుషీ చిల్లార్ కు ఒక ప్రశ్న ఎదురైంది. ‘ఒకవేళ మీరు డేట్ కు వెళ్ళాల్సి వస్తే ఏ హీరోతో వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు మానుషీ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. ‘నిజంగా ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న. ఎందుకంటే నేను ఎక్కువగా రామ్ చరణ్ ను ఇష్టపడతాను. అయితే అతడికి పెళ్ళైపోయింది కాబట్టి.. ఇప్పుడా అవకాశం లేదు. ఒక వేళ అవకాశం వస్తే అతడితో సినిమాకి కానీ, డిన్నర్ కు కానీ వెళతాను’.. అంటూ రామ్ చరణ్ పై తన అభిమానాన్ని చాటుకుంది. అంతేకాదు..  భవిష్యత్తులో అవకాశం వస్తే అతడితో తప్పకుండా ఒక సినిమా చేస్తానని కొసమెరుపుగా చెప్పింది. సో.. అలా మాజీ మిస్ వరల్డ్ రామ్ చరణ్‌ను మిస్ అయిందన్నమాట. 

Updated Date - 2022-06-02T16:55:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!