వేసవి సెలవుల్లో..

ABN , First Publish Date - 2022-12-29T01:31:07+05:30 IST

అక్కినేని నాగచైతన్య, తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకొంటున్న ‘కస్టడీ’ చిత్రం...

వేసవి సెలవుల్లో..

అక్కినేని నాగచైతన్య, తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకొంటున్న ‘కస్టడీ’ చిత్రం వచ్చే ఏడాది మే 12న విడుదల కానుంది. కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘కస్టడీ’ టైటిల్‌ పోస్టర్‌, ఫస్ట్‌ లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాను వేసవికి విడుదల చేస్తున్నట్లు నిర్మాత ప్రకటించి, మిగిలిన నిర్మాతలను అలెర్ట్‌ చేశారు. వేసవి సెలవుల్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో నిర్మాత శ్రీనివాస చిట్టూరి చిత్రాన్ని శర వేగంతో పూర్తి చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమా విడుదల కానుంది.

అరవింద్‌ స్వామి విలన్‌గా, ప్రియమణి ఓ వపర్‌పుల్‌ రోల్‌ లో నటిస్తున్నారు. తండ్రీ కొడుకులు ఇళయరాజా, యువన్‌ శంకర్‌రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2022-12-29T01:31:07+05:30 IST

Read more