ఆకట్టుకుంటున్న Driver Jamuna ట్రైలర్..

ABN , First Publish Date - 2022-07-08T18:16:32+05:30 IST

కెరీర్ ప్రారంభం నుంచి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో అలరిస్తున్న నటి ఐశ్వర్య రాజేష్‌ (Aishwarya Rajesh). ఇప్పుడు తను ప్రధాన పాత్రలో పా.కిన్‌స్లిన్‌ (Pa. Kinslin) తెరకెక్కించిన తాజా చిత్రం ‘డ్రైవర్‌ జమున’ (Driver Jamuna).

ఆకట్టుకుంటున్న Driver Jamuna ట్రైలర్..

కెరీర్ ప్రారంభం నుంచి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో అలరిస్తున్న నటి ఐశ్వర్య రాజేష్‌ (Aishwarya Rajesh). ఇప్పుడు తను ప్రధాన పాత్రలో పా.కిన్‌స్లిన్‌ (Pa. Kinslin) తెరకెక్కించిన తాజా చిత్రం ‘డ్రైవర్‌ జమున’ (Driver Jamuna). తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అటు తమిళ సినిమాలలో నటిస్తూనే తెలుగులో శైలజా కృష్ణమూర్తి, టక్ జగదీష్ లాంటి తెలుగు చిత్రాలలో నటించి టాలీవుడ్‌లోనూ క్రేజ్ తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్‌. ఇప్పుడు డ్రైవర్ జమున అంటూ వస్తోంది. ఈ సినిమాలో ఆడుకలం నరేన్‌, శ్రీ రంజని, అభిషేక్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎస్‌.పి.చౌదరి ఈ చిత్రానికి నిర్మాత. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. 


ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రైలర్‌ విడుదల చేశారు. ఇంట్లో వారికి ఇష్టం లేకపోయినా కుటుంబానికి అండగా నిలిచేందుకు క్యాబ్‌ డ్రైవర్‌గా మారిన యువతి కథే ఇది. ఒక రైడ్‌ తన జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఒకసారి తన క్యాబ్‌లో నేర నేపథ్యం ఉన్న కొందరు వ్యక్తులు ప్రయాణిస్తారు. వారి వల్ల జమున జీవితం ప్రమాదంలో పడుతుంది. వారి నుంచి ఆమె ఎలా బయటపడింది? ఈ క్రమంలో ఆమెకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేది మాత్రం సినిమా విడుదలయ్యాకే తెలుసుకోవాలి. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రమిది. రోడ్‌ జర్నీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో  జమునగా ఐశ్వర్య నటన హైలెట్‌గా నిలుస్తుందని తాజా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. 


ఇక ఈ సినిమా కోసమే ఐశ్వర్య ప్రత్యేకంగా కారు డ్రైవింగ్ నేర్చుకొంది. కొన్ని రిస్కీ సన్నివేశాలలోనూ డూప్‌ లేకుండా నటించింది. కమర్షియల్ హీరోయిన్‌గా అందరూ పెద్ద స్టార్స్ పక్కన నటించాలని ఆరాటపడుతున్నప్పటికీ ఐశ్వర్య రాజేష్ మాత్రం ఆ కోణంలో ఆలోచించకుండా తన మనసుకు నచ్చిన కథలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. మరి ఈ నేచురల్ పర్ఫార్మర్‌కి ‘డ్రైవర్‌ జమున’ ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. ఈ సినిమాకు సంగీతం జిబ్రాన్‌, ఛాయాగ్రహణం గోకుల్‌ బెనోయ్‌ అందిస్తున్నారు. Updated Date - 2022-07-08T18:16:32+05:30 IST

Read more