ఆ మూడు అంశాలతో ‘దోస్తాన్’
ABN , First Publish Date - 2022-11-29T09:23:59+05:30 IST
సిద్ స్వరూప్, కార్తికేయ, ఇందుప్రియ, ప్రియవల్లభి జంటగా నటించిన ‘దోస్తాన్’ చిత్రం డిసెంబర్ 2న విడుదల కానుంది....

సిద్ స్వరూప్, కార్తికేయ, ఇందుప్రియ, ప్రియవల్లభి జంటగా నటించిన ‘దోస్తాన్’ చిత్రం డిసెంబర్ 2న విడుదల కానుంది. సూర్యనారాయణ అక్కమ్మ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకొంది. సిద్ స్వరూప్ అందించిన కథ నచ్చడంతో ఈ చిత్రం తీశాం. తుని, లంబసింగి, తలకోన, వరంగల్, హైదరాబాద్, వైజాగ్, కాకినాడల్లో షూటింగ్ చేశాం. అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా ఫ్యామిలీ ఎమోషన్స్, ప్రేమ, స్నేహం అంశాలతో చిత్రాన్ని రూపొందించాం. సినిమాలో ఫైట్స్ రియలిస్టిక్ గా ఉంటాయి. త్వరలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తాం. డిసెంబర్ 2న వచ్చే మా సినిమాను ఆదరించాలని ప్రేక్షకుల్ని కోరుతున్నాం’ అన్నారు సూర్యనారాయణ అక్కమ్మ.