దోచేవారు వస్తున్నారు
ABN, First Publish Date - 2022-04-02T05:53:26+05:30
‘మనీ’, ‘సిసింద్రీ’, ‘పట్టుకోండి చూద్దాం’ లాంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను...
‘మనీ’, ‘సిసింద్రీ’, ‘పట్టుకోండి చూద్దాం’ లాంటి విభిన్నమైన వినోదాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివ నాగేశ్వరరావు. నూతన నటీనటులతో సరికొత్త తరహాలో కామెడీ థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనికి ‘దోచేవారెవరురా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఉగాది సందర్భంగా ఈ చిత్రం లోగోను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆవిష్కరించారు. బొడ్డు కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో ఫస్ట్‌లుక్, టీజర్‌ను చిత్రబృందం విడుదల చేయనుంది.