సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

DJ Tillu 2: మళ్లీ.. టిల్లు అన్న రెడీ అవుతున్నాడు!

ABN, First Publish Date - 2022-06-26T01:06:57+05:30

‘రాధిక అట్లుంటది మనతోని’ అంటూ తనదైన స్టైల్‌ డైలాగ్‌లతో ‘డీజే టిల్లు’గా అలరించారు సిద్ధూ జొన్నలగడ్డ. విమల్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కొనసాగింపు కూడా ఉంటుందని చిత్ర బృందం హింట్‌ ఇచ్చారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉందా అనంటే.. నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్‌తో ‘సినిమా షురూ’ అనే అనిపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘రాధిక అట్లుంటది మనతోని’ అంటూ తనదైన స్టైల్‌ డైలాగ్‌లతో ‘డీజే టిల్లు’(Dj tillu)గా అలరించారు సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu jonnalagadda). విమల్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కొనసాగింపు కూడా ఉంటుందని చిత్ర బృందం హింట్‌ ఇచ్చారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉందా అనంటే.. నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్‌తో ‘సినిమా షురూ’ అనే అనిపిస్తోంది. శనివారం ఆయన స్ర్కిప్ట్‌ పుస్తకాన్ని దేవుడి పటాల ముందుంచి పూజ చేసిన ఫొటోను పంచుకుంటూ ‘ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్రాంఛైజీ రౌండ్‌–2 పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు నుంచి ఈ క్రేజీ అడ్వెంచర్‌ షూటింగ్‌ మొదలవుతుంది’ అంటూ ట్వీట్‌ చేశారు. (DJ till 2 shoot from august)


ఆయన ట్వీట్‌కు స్పందించిన నెటిజన్లు ‘టిల్లు అన్న’ రెడీ అవుతున్నాడు’ అంటూ కామెంట్లు చేశారు. దర్శకనిర్మాత మధుర శ్రీధర్‌ కూడా విషెస్‌ చెబుతూ  ‘సోదరా.. పార్ట్‌–2 కూడా బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకోవాలి’ అని సిద్ధూ జొన్నలగడ్డని ట్యాగ్‌ చేశారు.  దీనికి థ్యాంక్యూ సర్‌’ అని సిద్ధూ.. మధుర శ్రీధర్‌కు రిప్లై ఇచ్చారు. దీనితో నెటిజన్లు అంతా ‘డీజే టిల్లు–2 కోసం టిల్లు అన్న సిద్ధమవుతున్నాడు’ అంటూ నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నారు.  అయితే నిర్మాణ సంస్థ ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. విమల్‌ కృష్ణ (Vimal krishna)దర్శకత్వం వహించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సిద్ధూ కూడా స్ర్కిప్ట్‌ వర్క్‌లో భాగమయ్యారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. (Suryadevara naga vamsi)




Updated Date - 2022-06-26T01:06:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!