సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘Ramarao On Duty’ రిజల్ట్ కోసం వేచి చూస్తోన్న Majili భామ

ABN, First Publish Date - 2022-07-15T22:29:18+05:30

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), సమంత (Samantha) హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మజిలీ’ (Majili) చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది యంగ్ హీరోయిన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), సమంత (Samantha) హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మజిలీ’ (Majili) చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది యంగ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik). ఆ సినిమాలో అన్షు పాత్రలో మొదటి సినిమాతోనే కుర్రకారు హృదయాలను దోచుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. విమర్శకులు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ సినిమాలో దివ్యాంశ కౌశిక్ తన నటనతో అందరినీ అలరించింది. ‘మజిలీ’ తర్వాత సిద్దార్థ్ నటించిన ‘టక్కర్’ సినిమాతో దివ్యాంశ కౌశిక్ తమిళంలో అరంగేట్రం చేసింది. మళ్లీ ఈ ముద్దుగుమ్మ ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో పూర్తి స్థాయి హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు చేరువ కాబోతోంది.


శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty). ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన  సొట్టల బుగ్గల్లో పాటలో రవితేజ సరసన కనిపించి మరోసారి కుర్రకారును ఆకట్టుకుంది దివ్యాంశ. ప్రస్తుతం ఈ భామకు టాలీవుడ్‌ నుంచి మంచి మంచి అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. కేవలం తెలుగు చిత్రాలు మాత్రమే అని కాకుండా.. కోలీవుడ్‌లో కూడా ఆమెకు అవకాశాలు వరిస్తున్నాయట. టాలీవుడ్‌లో ప్రస్తుతం హీరోయిన్ల కొరత ఉంది. కాజల్, తమన్నా, అనుష్క వంటివారికి ఇప్పుడు అవకాశాలు తగ్గాయి. కుర్ర హీరోలంతా కొత్త హీరోయిన్ల కోసం చూస్తున్నారు. ఇలాంటి సమయంలో.. అందం, అభినయం సమపాళ్లలో ఉన్న దివ్యాంశ ఆ లోటు భర్తీ చేస్తుందనేలా ఆమెపై ఇప్పుడు వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం రవితేజ సరసన ఆమె నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూలై 29న విడుదల కాబోతోంది. ఈ చిత్రం కనుక బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తే.. ఇక దివ్యాంశ దశ తిరిగినట్లే.



Updated Date - 2022-07-15T22:29:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!