సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

విడాకుల పోస్ట్‌ డిలీట్‌.. అర్థమేమిటి?

ABN, First Publish Date - 2022-01-22T05:49:19+05:30

నాగచైతన్య - సమంత ప్రేమించి, పెళ్లి చేసుకుని, నాలుగేళ్ల తరవాత పరస్పర అంగీకారంతో విడిపోయిన సంగతి తెలిసిందే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగచైతన్య - సమంత ప్రేమించి, పెళ్లి చేసుకుని, నాలుగేళ్ల తరవాత పరస్పర అంగీకారంతో విడిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ మళ్లీ కలిసిపోతే బాగుంటుందన్నది అభిమానుల ఆశ. సమంత ఇప్పుడు ఆ ఆశల్ని చిగురించేలా ఓ పని చేసింది. గతేడాది అక్టోబరు 2న నాగచైతన్యతో విడిపోతున్నట్టు సమంత సోషల్‌ మీడియా ద్వారా సందేశాలు పంపింది. ట్విట్టర్‌, ఇన్‌స్టా నుంచి ఇప్పుడు ఆ పోస్ట్‌ని సడన్‌గా తొలగించింది. దాంతో సమంత అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సమంత ఈ పోస్ట్‌ని డిలీట్‌ చేసిందంటే.. వీరిద్దరూ మళ్లీ కలిసిపోతున్నారా? అంటూ ఆరాలు తీస్తున్నారు. ట్విట్టర్‌లో సమంతని ఫాలో అయ్యే వాళ్లు ఇదే ప్రశ్న సంధిస్తున్నారు. కానీ సమంత మాత్రం సమాధానం చెప్పడం లేదు. మరి ఈ పోస్ట్‌ డిలీట్‌ చేయడం వెనుక సమంత అంతరార్థం ఏమిటో? మరోవైపు నాగచైతన్య సోషల్‌ మీడియా ఖాతాల్లో మాత్రం విడాకుల పోస్ట్‌ అలానే ఉంది.


Updated Date - 2022-01-22T05:49:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!