సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Liger: పూరి జగన్ ఇంకా డబ్బులు ఇవ్వలేదట!

ABN, First Publish Date - 2022-09-19T22:00:59+05:30

లైగర్ (Liger) విడుదల అయింది, అట్టర్ ప్లాప్ (Utter Flop) కూడా అయింది, అయినా వార్తల్లో ఇంకా వుంది. ఎందుకంటే పూరి జగన్ (Puri Jagan) మరియు ఛార్మి (Charmmy)లు ఆ సినిమాతో వంద కోట్లకు (100 Crores) పైగా లాభం ఆర్జించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లైగర్ (Liger) విడుదల అయింది, అట్టర్ ప్లాప్ (Utter Flop) కూడా అయింది, అయినా వార్తల్లో ఇంకా వుంది. ఎందుకంటే పూరి జగన్ (Puri Jagan) మరియు ఛార్మి (Charmmy)లు ఆ సినిమాతో వంద కోట్లకు (100 Crores) పైగా లాభం ఆర్జించారు. సినిమా ప్లాప్ అవ్వటంతో బయ్యర్స్ అతన్ని కొంత డబ్బు రిటర్న్ చెయ్యమని ఒత్తిడి తెస్తున్నారు. కొంత మంది బయ్యర్స్ కి పూరి కొంత పే చేసాడు అని ఒక వార్త. కానీ అతను పే చేసాడో లేదో తెలియదు. వరంగల్ శీను (Warangal Srinu) ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 90 కోట్లకు తీసుకున్నాడు. అతను అక్షరాలా 52 కోట్లు పూరి జగన్ కి ఇచ్చాడు. ఇప్పుడు సినిమా పోవటంతో అతను కూడా జగన్ మీద ఒత్తిడి తెస్తున్నాడు, తనకి కొంత పే చెయ్యమని. ఇదిలా ఉంటే అందులో నటించిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కు కూడా పూరి జగన్ పూర్తిగా రెమ్యూనరేషన్ (Remunaration) ఇవ్వలేదుట. 25శాతం మాత్రమే అడ్వాన్స్ ఇచ్చి, మిగతాది సినిమా విడుదల అయ్యాక ఇస్తాను అన్నాడట. కానీ ఇవ్వలేదుట.  ప్రస్తుతం విజయ్ ముంబై (Mumbai) లోనే వున్నాడు, పూరి జగన్ తో తనకి రావాల్సిన మిగతా డబ్బు గురించి మాట్లాడుతున్నాడు అని ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఇలా డబ్బులన్నీ తన దగ్గరే పెట్టుకొని, ముంబై లోనే కాలం గడుపుతున్న పూరి జగన్, ఛార్మీలు మళ్ళీ మొసలి కన్నీరు కారుస్తున్నారు. కనీసం కొంత అయినా రిటర్న్ ఇవ్వాలి కదా!


Updated Date - 2022-09-19T22:00:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!