నేను సినిమా వైపు రావడానికి కారణం ఆయనే: Sukumar
ABN , First Publish Date - 2022-05-18T23:52:22+05:30 IST
అప్పుడే మొట్టమొదటిసారి సినిమాకు సంబంధించిన ఆర్ట్ ఫామ్ అంటే.. నేను కూడా సినిమాలు చేయగలను అనే కాన్ఫిడెంట్ వచ్చింది. దాంతో నేను మొదటిసారి రాజశేఖర్‌గారిని ఇమిటేట్ చేసి మాట్లాడేవాన్ని.. దాంతో మా ఊర్లో నేను చాలా ఫేమస్ అయ్యాను. ఆ తర్వాత నన్ను స్కూల్లో..

‘‘నేను సినిమాల్లోకి రావడానికి.. నాకు సినిమాతో అనుబంధం ఫామ్ అవ్వడానికి కారణం యాంగ్రీ మ్యాన్ రాజశేఖరే (Rajasekhar) కారణం’’ అని అన్నారు క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ (Sukumar). డాక్టర్ రాజశేఖర్ నటించిన 91 వ సినిమా ‘శేఖర్’ (Shekar). జీవితా రాజశేఖర్ (Jeevitha Rajasekhar) దర్శకత్వంతో స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో.. పెగాసస్ సినీకార్ప్, టారస్ సినీకార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి (Beeram Sudhakara Reddy), శివాని రాజశేఖర్ (Shivani Rajashekar), శివాత్మిక రాజశేఖర్ (Shivathmika Rajashekar), వెంకట శ్రీనివాస్ బొగ్గరం (Boggaram Venkata Srinivas) నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని హోటల్ దస్పల్లాలో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో సినిమాకు సంబంధించి రాజశేఖర్‌గారితో మంచి అనుబంధం ముడిపడింది. ఆయన హీరోగా పీక్‌లో ఉన్నప్పుడు ‘ఆహుతి (Aahuthi), ఆగ్రహం (Aagraham), తలంబ్రాలు (Talambralu), మగాడు (Magadu), అంకుశం (Ankusham)’.. వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు చూసి ఆయన వీరాభిమానిని అయ్యాను. అప్పుడే మొట్టమొదటిసారి సినిమాకు సంబంధించిన ఆర్ట్ ఫామ్ అంటే.. నేను కూడా సినిమాలు చేయగలను అనే కాన్ఫిడెంట్ వచ్చింది. దాంతో నేను మొదటిసారి రాజశేఖర్‌గారిని ఇమిటేట్ చేసి మాట్లాడేవాన్ని.. దాంతో మా ఊర్లో నేను చాలా ఫేమస్ అయ్యాను. ఆ తర్వాత నన్ను స్కూల్లో తనలా మాట్లాడమనే వారు. అలా.. నేను కూడా సినిమాల్లోకి రాగలను, ఏమైనా చేయగలను అనే అనుబంధం ఫామ్ అవ్వడానికి రాజశేఖర్‌గారే కారణం. ఇది అతిశయోక్తి కానే కాదు. అయితే ఇంతవరకు ఇలా చెప్పే సందర్భం ఎప్పుడూ రాలేదు కాబట్టి ఇప్పుడు చెపుతున్నాను. ఇలా నాకు సినిమాకు సంబంధించిన లైఫ్‌ను ఇంత అద్భుతంగా మార్చినందుకు, అందుకు కారణం అయినందుకు రాజశేఖర్‌గారికి థాంక్స్. మనం మన ఫ్యామిలీని ఇండస్ట్రీకి దూరం పెడతాం కానీ.. రాజశేఖర్‌గారు తన ఇద్దరి ఆడపిల్లలను కూడా ఇండస్ట్రీకి తీసుకురావడం చాలా గ్రేట్. జీవితగారు చాలా హార్డ్ వర్కర్.. తను ఫ్యామిలీని చూసుకుంటూ.. సినిమాతో పాటు దర్శకత్వం చేయడం చాలా కష్టం. కాబట్టి ఈ సినిమా జీవితగారి కోసం సక్సెస్ కావాలి. రామ జోగయ్య శాస్తి (Ramajogayya Sastry)గారు అద్భుతమైన పాటలు రాస్తున్నారు. అనూప్ (Anup Rubens)గారు ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా ఇలాగే వినయంగా ఉంటారు. ఈ నెల 20న వస్తున్న ‘శేఖర్’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని, టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను..’’ అన్నారు.
