సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Rajamouli vs Sukumar: ఏ రోజుకైనా ఈ ఇద్దరి మధ్య వార్ తప్పదు!

ABN, First Publish Date - 2022-07-19T03:01:32+05:30

తన మేకింగ్‌తో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ నే పెంచిన డైరెక్టర్ ఎస్. ఎస్. రాజమౌళి (SS Rajamouli). లార్జ్ స్కేల్ సినిమాలు, హ్యూజ్ విజువల్ ఎఫెక్ట్స్ రాజమౌళి బలం. అందుకే పాన్ ఇండియా ఈరోజు జక్కన్నకి జై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన మేకింగ్‌తో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ నే పెంచిన డైరెక్టర్ ఎస్. ఎస్. రాజమౌళి (SS Rajamouli). లార్జ్ స్కేల్ సినిమాలు, హ్యూజ్ విజువల్ ఎఫెక్ట్స్ రాజమౌళి బలం. అందుకే పాన్ ఇండియా ఈరోజు జక్కన్నకి జై కొడుతోంది. రీసెంట్‌గా ప్రశాంత్ నీల్ (Prashanth Neel), లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) పాన్ ఇండియా హిట్స్ ఇచ్చి, రాజమౌళికి తామే పోటీ అని అనిపించుకున్నారు. నిజానికి ఆ ఇద్దరిలో కంటిన్యూస్‌గా ఆ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేసే సత్తా ఉందా? అంటే రాజమౌళి బిగ్గెస్ట్ ఎస్సెట్ ఎమోషన్స్... ఎంత టెక్నికల్ స్టఫ్ ఉన్నా కూడా తెరపై రాజమౌళి ఎమోషన్స్‌ని సూపర్బ్‌గా ప్రెజెంట్ చేస్తాడు. అంతలా లోకేష్ అండ్ ప్రశాంత్ ఎమోషన్స్‌తో ప్లే చేస్తారా అంటే నో అనే చెప్పాలి. ఈ ఇద్దరూ ఎక్కువగా మేకింగ్ పైనే డిపెండ్ అయిన వాళ్లు. ప్రశాంత్ నీల్ కాదు లోకేష్ కనగరాజ్ కాదు... మరీ రాజమౌళికి పోటీ ఎవరు? 


ఎవరి నుంచి రాజమౌళికి గట్టి పోటీ ఎదురు కానుంది అంటే.. రాజమౌళి తర్వాత టాలీవుడ్‌లో అంతటి సత్తా ఉన్న ఏకైక డైరెక్టర్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) మాత్రమే. స్వయంగా జక్కన్నే.. నాకు సుక్కుతోనే పోటీ అనే స్టేట్మెంట్ ఇచ్చాడంటే సుకుమార్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. క్రియేటివిటీని మేకింగ్ అండ్ రైటింగ్ రెండింటిలో చూపించగల సత్తా ఉన్న సుకుమార్, ‘పుష్ప’ (Pushpa) సినిమాతో ఒక్క ప్రెస్‌మీట్ కూడా పెట్టకుండానే బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ని షేక్ చేశాడు. ఇప్పుడు ‘పుష్ప 2’ (Pushpa 2) మీద ఉన్న హైప్‌ని కన్సిడర్ చేస్తే, ఆ సినిమాతో బాలీవుడ్ లోని టాప్ 3 రికార్డులని కదిలించడం గ్యారెంటీగానే కనిపిస్తోంది. ఇప్పటికైతే కెరియర్ గ్రాఫ్ పరంగా రాజమౌళి, సుకుమార్‌ల మధ్య డిఫరెన్స్ చాలానే ఉంది కానీ.. అతి త్వరలో, అన్నీ అనుకున్నట్లు జరిగితే జక్కన్న vs సుక్కు (Jakkanna vs Sukku) పాన్ ఇండియా ఫైట్ చూసే అవకాశం లేకపోలేదు.

Updated Date - 2022-07-19T03:01:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!