సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

విజయ్ దేవరకొండతో సినిమా క్యాన్సిల్..క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ABN, First Publish Date - 2022-01-21T13:45:32+05:30

టాలీవుడ్ రౌడీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ మూవీ క్యాన్సిల్ అయిందంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం కూడా ఆయన గత చిత్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ రౌడీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ మూవీ క్యాన్సిల్ అయిందంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం కూడా ఆయన గత చిత్రం 'టక్ జగదీష్' ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో, విజయ్ ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, తాజాగా ఈ విషయంపై స్పందించారు దర్శకుడు శివ నిర్వాణ. ఈ వార్తలన్ని కేవలం రూమర్సేనని క్లారిటీ ఇచ్చారు. అంటే ఖచ్చితంగా శివ నిర్వాణ - విజయ్ దేవరకొండల కాంబోలో మూవీ ఉంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి వచ్చినవన్ని పుకార్లేనని తేలిపోయింది. 'టక్ జగదీష్' నిరాశపరచడంతో మళ్ళీ 'నిన్ను కోరి', 'మజిలీ' లాంటి ఎమోషనల్ లవ్ స్టోరిని తయారు చేసుకుంటున్నారు శివ నిర్వాణ. అయితే, ఈ ప్రాజెక్ట్ ఏ హీరోతో ఉంటుందో అనేది మాత్రం వెల్లడించలేదు. 

Updated Date - 2022-01-21T13:45:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!