అట్లీ ఇంట్లో ఆనందం

ABN , First Publish Date - 2022-12-17T00:50:42+05:30 IST

త్వరలో తను తండ్రి కాబోతున్నట్లు శుక్రవారం సోషల్‌ మీడియా ద్వారా అట్లీ వెల్లడించారు.

అట్లీ ఇంట్లో ఆనందం

వినూత్నమైన టేకింగ్‌తో కమర్షియల్‌ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిన తమిళ దర్శకుడు అట్లీ. షారుఖ్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘పఠాన్‌’ చిత్రంతో ఆయన బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. నటి కృష్ణప్రియను ప్రేమించి, ఎనిమిదేళ్ల క్రితం ఆమెను పెళ్లి చేసుకున్నారు అట్లీ. ఆ తర్వాత ఏ ఫర్‌ ఆపిల్‌ పేరుతో చిత్రనిర్మాణ సంస్థను నెలకొల్పి రెండు చిత్రాలు నిర్మించారు. త్వరలో తను తండ్రి కాబోతున్నట్లు శుక్రవారం సోషల్‌ మీడియా ద్వారా అట్లీ వెల్లడించారు.

Updated Date - 2022-12-17T00:50:56+05:30 IST

Read more