Dil Raju: ‘వారసుడు’ కాంట్రవర్సీకి కారణమెవరో నాకు తెలుసు.. కానీ (OHRK promo)

ABN , First Publish Date - 2022-11-25T06:06:46+05:30 IST

డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా దిల్ రాజు (Dil Raju) ప్రస్థానం సక్సెస్‌పుల్‌గా నడుస్తోంది. ఒకానొక టైమ్‌లో ఆయన పట్టిందల్లా బంగారం అయ్యింది. మరొక టైమ్‌లో వరుసగా పరాజయాలనూ చవిచూశారు. కష్టం, సుఖం..

Dil Raju: ‘వారసుడు’ కాంట్రవర్సీకి కారణమెవరో నాకు తెలుసు.. కానీ (OHRK promo)

డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా దిల్ రాజు (Dil Raju) ప్రస్థానం సక్సెస్‌పుల్‌గా నడుస్తోంది. ఒకానొక టైమ్‌లో ఆయన పట్టిందల్లా బంగారం అయ్యింది. మరొక టైమ్‌లో వరుసగా పరాజయాలనూ చవిచూశారు. కష్టం, సుఖం (నష్టం, లాభం) తెలిసిన వ్యక్తి కాబట్టే.. అన్నింటినీ బేరీజు వేసుకుంటూ.. ఇప్పుడు శ్రీ వేంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌ను ఒక బ్రాండ్‌గా మార్చేశారు. అయితే, పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లుగా.. ఆయన విషయంలో కూడా ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ దిల్ రాజుని వెంటాడుతూనే ఉంటుంది. అయినా వాటన్నింటిని ఎదుర్కొంటూ.. తిరుగులేని శక్తిగా.. మకుటం లేని ‘రాజు’గా మారిన దిల్ రాజు.. తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే (Open Heart with RK) కార్యక్రమంలో పాల్గొని.. తనకు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో.. (Open Heart with RK Promo)  


* మీ అసలు పేరు జనాలు మరిచిపోయారు.. మీకైనా అసలు గుర్తుందా?

* అసలు ‘రాజు’ అనే పేరు ఎలా వచ్చింది?


* మీ గెటప్ అదీ చూస్తుంటే.. మీరే హీరోగా సినిమాలు తీయవచ్చు కదా?

* జనరల్‌గా తెలంగాణ (Telangana) వాళ్లకి సినిమా అంటే కనెక్షన్ తక్కువ.. మరి మీరు ఎలా వచ్చారు?

* డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా చాలా దెబ్బలు ఎదుర్కొన్నట్టున్నారుగా?

* డిస్ట్రిబ్యూటర్స్‌కి సినిమా చూపించకుండానే అమ్మేస్తారా?

* చూస్తుంటే ఇదంతా ఓ మాయలా ఉందిగా..

* ఈ మధ్య ప్రొడ్యూసర్స్ నాలుగైదు సినిమాల కంటే ఎక్కువగా కనిపించడం లేదు కదా..

* ఒక సినిమా 1000 కోట్లు వసూలు చేస్తే.. అందులో నిర్మాతకి మిగిలేది ఎంత?

* ఒకప్పుడు హిందీ హీరోలకి 100 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేవాళ్లు.. ఇప్పుడు తెలుగు హీరోలకి కూడా 100 కోట్లు ఇచ్చే పరిస్థితి వచ్చేసిందిగా..

* నెల రోజులు షూటింగ్స్ బంద్ పెట్టారు కదా.. ఏమైనా వర్కవుట్ అయ్యిందా? (Dil Raju Open Heart with RK) 

* ఇండస్ట్రీలో నాయకుడిగా ఉన్నారుగా.. మరి ఇండస్ట్రీని చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదా?

* మధ్యలో థియేటర్ల విషయంలో ‘ఆ నలుగురు’ అంటూ పెద్ద వివాదమే చెలరేగిందిగా?

* మీరే తీసే సినిమా ‘వారసుడు’ (Vaarasudu) కూడా వివాదమవుతుందిగా?

* దిల్ రాజుపై బాగా అసూయ వచ్చిందని భావిస్తున్నారా?

* ఏపీ గవర్నమెంట్ (AP Government) దెబ్బకి సినిమా పరిస్థితి ఎలా మారింది?

* మీ వెనకాల పొలిటికల్ లీడర్స్ మనీ ఉందంటున్నారు.. నిజమా?.. వంటి ఎన్నో ప్రశ్నలకు దిల్ రాజు ఈ కార్యక్రమంలో సమాధానాలిచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయనిచ్చిన సమాధానాలేంటో తెలియాలంటే.. ఆదివారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ABN ఆంధ్రజ్యోతి ఛానల్‌లో ప్రసారమయ్యే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే (OHRK) కార్యక్రమం చూడాల్సిందే. (Open Heart with RK Promo)

Updated Date - 2022-11-25T06:06:46+05:30 IST

Read more