మా ఆశిష్‌ను యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్: దిల్ రాజు
ABN, First Publish Date - 2022-01-16T04:01:12+05:30
ఆశిష్ (నిర్మాత శిరీష్ తనయుడు) హీరోగా శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న
ఆశిష్ (నిర్మాత శిరీష్ తనయుడు) హీరోగా శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు ప్రేక్షకులతో కలిసి ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
‘‘రౌడీ బాయ్స్ చిత్రాన్ని యూత్‌ఫుల్ కంటెంట్‌తో తెరకెక్కించామని ముందు నుండి చెబుతూ వచ్చాను. ఇప్పుడు ‘రౌడీ బాయ్స్’ సంధ్య థియేటర్లో, ప్రసాద్ ఐ మ్యాక్స్‌లో చూశాను. ప్రతి సీన్‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో సాంగ్స్ వచ్చే సీన్లో ఆడియెన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా మ్యూజికల్‌గా, డాన్సుల పరంగానూ ప్రేక్షకులను మెప్పించింది. 2 గంటల 25 నిమిషాలు ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా చూసిన వారందరూ బాగుందని అంటున్నారు. ఓ కొత్త హీరో సినిమాను బాగుందని అనడం చాలా ఆనందంగా ఉంది. మా బ్యానర్ ద్వారా హీరోగా పరిచయం అయిన ఆశిష్‌ను ఆశీర్వదించి యాక్సెప్ట్ చేసినందుకు అందరికీ చాలా చాలా థాంక్స్. అన్నీ ఏరియాల నుంచి సినిమా బాగుందని అప్రిషియేషన్ రావడంతో చాలా సంతోషాన్ని ఇస్తుంది..’’ అన్నారు.