సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పూజా మన కాజా.. కాలు పెడితే హిట్టే: అగ్ర నిర్మాత

ABN, First Publish Date - 2022-04-09T20:14:16+05:30

‘మేడమ్‌ సర్‌... మేడమ్‌ అంతే’ అల వైకుంఠపురములో’ పూజాహెగ్డే గురించి అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్‌ ఇది. ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా పూజా గురించి ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. ఆమె అందుకుంటున్న సక్సెస్‌లకి ‘పూజా సర్‌ పూజా అంతే’ అంటున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ‘బీస్ట్‌’ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో దిల్‌ రాజు ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘మేడమ్‌ సర్‌... మేడమ్‌ అంతే’ అల వైకుంఠపురములో’ పూజాహెగ్డే గురించి అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్‌ ఇది. ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా పూజా గురించి ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. ఆమె అందుకుంటున్న సక్సెస్‌లకి  ‘పూజా సర్‌ పూజా అంతే’ అంటున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ‘బీస్ట్‌’ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో దిల్‌ రాజు ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు. 

‘పూజా మన కాజా.. 

పూజా ఉంటే హిట్టే... 

వరుస విజయాలతో ఆలిండియా స్టార్‌ అయింది

ఇప్పుడు ప్యాన్‌ ఇండియా స్టార్‌గా మారింది’ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. అంతే కాదు.. ‘పూజా నెక్ట్స్‌ సినిమా డేట్స్‌ నాకు ఇస్తావా? అని కూడా అడిగారు. విజయ్‌, పూజా హెగ్డే నటించిన ‘బీస్ట్‌’ చిత్రాన్ని తెలుగులో దిల్‌ రాజు ఈ నెల 13న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘పూజా లెగ్‌ పెడితే సినిమా సూపర్‌హిట్టే అని అన్నారు. డాన్సులే కాకుండా సినిమా సినిమాకు తన నటనలో పరిణితి కనిపిస్తోందని కొనియాడారు. ‘ఆమె కథానాయికగా నటించిన ‘డీజే’, ‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘అల వైకుంఠపురములో’ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఇప్పుడు ‘బీస్ట్‌’ కూడా సూపర్‌హిట్‌ కానుంది. పూజా.. నెక్ట్స్‌ ఫిల్మ్‌ డేట్స్‌ నాకు ఇస్తావా? అని బీస్ట్‌ వేడుకలో దిల్‌ రాజు కోరారు. ‘ఇప్పుడైనా సరే మీ బ్యానర్‌లో సినిమా అంటే నేను రెడీ అన్నట్లు పూజా వేదిక కింద నుంచి సంకేతాలిచ్చారు. నెల్సన్‌ దిలీప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్‌పై ‘దిల్‌’రాజు తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 






Updated Date - 2022-04-09T20:14:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!