సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Allu Sirish: ఏదో మ్యాజిక్ చేసేలానే ఉన్నాడు

ABN, First Publish Date - 2022-10-07T18:23:05+05:30

అల్లు శిరీష్ (Allu Sirish), అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo). ముందు ప్రకటించిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లు శిరీష్ (Allu Sirish), అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo). ముందు ప్రకటించిన ‘ప్రేమకాదంట’ (PremaKadanta) టైటిల్‌ను మార్చి ‘ఊర్వశివో రాక్షసివో’ అంటూ ఇటీవల మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన వదిలిన టీజర్.. అందులో ఉన్న కంటెంట్‌తో ఒక్కసారిగా అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. ముఖ్యంగా శిరీష్, అనుల మధ్య రొమాంటిక్ సీన్స్.. యూత్‌ని బాగా ఆకర్షించాయి. నవంబర్ 4వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈలోపు సాధ్యమైనంతగా చిత్రాన్ని ప్రేక్షకులలోకి తీసుకెళ్లేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా.. ముందుగా ఓ లవ్లీ మెలోడీ సాంగ్‌ని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ సాంగ్ ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమో సినిమాపై మరింతగా అంచనాలను క్రియేట్ చేయడమే కాకుండా.. అల్లు శిరీష్ ఈ సినిమాతో ఏదో మ్యాజిక్ చేసేలానే ఉన్నాడనేలా మాట్లాడుకునేలా చేస్తోంది.


ఈ సాంగ్ విషయానికి వస్తే.. టాప్ సింగర్ సిద్ శ్రీరామ్ (Sid Sriram) స్వరంతో

‘‘అనగా అనగనగా, కనులే కలగనగా,

నిజమై మెరుపల్లే వాలేగా,

నా ఊపిరి నడక.. తన ఊపిరి జతగా

కలగలిసి మొదలై నాలో అలజడిగా’’ అనే సాహిత్యంతో మొదలైన ఈ పాట మంచి ఫీల్‌ను క్రియేట్ చేస్తుంది. ఈ పాటలో కూడా అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్‌ల కెమిస్ట్రీ.. మరోసారి ఈ సినిమాని వార్తలలో నిలిచేలా చేస్తున్నాయి. ఈ పాటను అచ్చు రాజమణి (Achu Rajamani) స్వరపరచగా.. పూర్ణాచారి (Purnachary) సాహిత్యం అందించారు. సిద్ శ్రీరామ్ వాయిస్‌లో ఈ పాట వినసొంపుగా ఉంది. ఈ లవ్లీ మెలోడీ ఫుల్ సాంగ్‌ను అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. కాగా, అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని GA2 పిక్చర్స్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. విజయ్ ఎం సహానిర్మాతగా వ్యవహారిస్తున్నారు. ‘విజేత’ సినిమా దర్శకుడు రాకేష్ శశి (Rakesh Sashii) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది.  



Updated Date - 2022-10-07T18:23:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!