అభిమానులకు ఇది పండగ ధమాకా

ABN , First Publish Date - 2022-12-31T02:17:54+05:30 IST

‘ధమాకా’ సినిమాకు డ్రైవర్‌ దర్శకుడు నక్కిన త్రినాథరావు, నేను కండక్టర్‌ని. అభిమానులు ఇలాంటి పండగ చేసుకొని రెండేళ్లు అయింది.

అభిమానులకు ఇది పండగ ధమాకా

‘‘ధమాకా’ సినిమాకు డ్రైవర్‌ దర్శకుడు నక్కిన త్రినాథరావు, నేను కండక్టర్‌ని. అభిమానులు ఇలాంటి పండగ చేసుకొని రెండేళ్లు అయింది. ఇకపై గ్యాప్‌ ఇవ్వొద్దు. పండగ మీద పండగ చేసుకోవాలి’ అని రవితేజ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఇటీవలె విడుదలై ఘన విజయాన్ని అందుకొంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సె్‌సమీట్‌ను నిర్వహించింది. రవితేజ మాట్లాడుతూ ‘భీమ్స్‌ సిసిరోలియో సంగీతం, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ ప్రచారం చేసిన విధానం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం. ఈ సినిమాకి మరో ఆకర్షణ కథానాయిక శ్రీలీల. ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోనే తను పెద్ద స్టార్‌ కాబోతోంది’ అన్నారు. త్రినాథరావు మాట్లాడుతూ ‘ఎంతోమంది కష్టపడితే ఈ రోజు ‘ధమాకా’ని ఎంజాయ్‌ చేస్తున్నాం. ఈ విజయాన్ని రవితేజ అభిమానులకు అంకితం ఇస్తున్నాను’ అన్నారు. శ్రీలీల మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలో ఇది నా రెండో అడుగు. పెద్ద బ్లాక్‌బస్టర్‌ చేశారు. రవితేజగారు బంగారం. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు’ అని చెప్పారు.

Updated Date - 2022-12-31T02:17:54+05:30 IST

Read more