సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

దీపావళి క్రాకర్‌... ‘ధమాకా’

ABN, First Publish Date - 2022-10-08T05:30:00+05:30

రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ధమాకా’. డబుల్‌ ఇంపాక్ట్‌ అనేది ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ధమాకా’. డబుల్‌ ఇంపాక్ట్‌ అనేది ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మాత. దీపావళి సందర్భంగా ఈనెల 21న ‘ధమాకా క్రాకర్‌’ పేరుతో టీజర్‌ని విడుదల చేస్తున్నారు. ‘‘మాస్‌ మహారాజా మరో సరికొత్త అవతారం ఇది. ఈసారి డబుల్‌ ఇంపాక్ట్‌ చూపిస్తారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి పేరు వస్తోంది. భీమ్స్‌ అందించిన బాణీలు హుషారుగా సాగిపోతాయి. త్వరలోనే విడుదల తేదీ కూడా ప్రకటిస్తామ’’ని నిర్మాత తెలిపారు. సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, కథ, స్ర్కీన్‌ ప్లే, సంభాషణలు: ప్రసన్న కుమార్‌ బెజవాడ

Updated Date - 2022-10-08T05:30:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!