సూపర్‌ స్టార్‌కి అంకితం

ABN , First Publish Date - 2022-12-19T02:22:55+05:30 IST

వీరు.కె.రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘మా ఊర్లో ఒక పడుచుంది’. దెయ్యమంటే భయమన్నది...

సూపర్‌ స్టార్‌కి అంకితం

వీరు.కె.రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘మా ఊర్లో ఒక పడుచుంది’. దెయ్యమంటే భయమన్నది అనేది ఉపశీర్షిక. సోమా విజయ్‌ ప్రకాశ్‌ నిర్మాత. ‘‘షూటింగ్‌ కూడా మొదలు పెట్టకుండా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేశాం. ప్రపంచ చలన చిత్ర చరిత్రలో.. ఇలాంటి ప్రయోగం చేయడం ఇదే తొలిసారి. మా ప్రయత్నాన్ని భారత్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ కూడా గుర్తించి ధృవీకరణ పత్రం అందజేసింద’’న్నారు దర్శకుడు. ‘‘కృష్ణగారి సూపర్‌ హిట్‌ పాటల్లో.. ‘మా ఊర్లో ఒక పడుచుంది’ ఎవర్‌గ్రీన్‌. ఆ పాటలోని తొలి పదాల్ని మా టైటిల్‌గా మార్చుకొన్నాం. అందుకే సూపర్‌ స్టార్‌కి ఈ సినిమాని అంకితం చేస్తున్నామ’’ని నిర్మాత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-19T02:23:46+05:30 IST