సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Gautham Karthik-Manjima Mohan: పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి

ABN, First Publish Date - 2022-11-25T15:43:14+05:30

తామిద్దరం ప్రేమించుకున్న మాట వాస్తవమేనని, అయితే పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకుంటున్నట్టు యువ హీరో హీరోయిన్లు గౌతమ్ కార్తీక్‌, మంజిమా మోహన్‌ చెప్పారు. నాగచైతన్య హీరోగా నటించిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తామిద్దరం ప్రేమించుకున్న మాట వాస్తవమేనని, అయితే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నట్టు యువ హీరో హీరోయిన్లు గౌతమ్ కార్తీక్‌, మంజిమా మోహన్‌ చెప్పారు. నాగచైతన్య హీరోగా నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ (Sahasam Swasaga Sagipo) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న మలయాళ భామ మంజిమా మోహన్‌ (Manjima Mohan). ఈ భామ ఇటీవల నటుడు గౌతమ్‌ కార్తీక్‌ (Gautham Karthik)తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ప్రకటించి అందరికీ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా సాగుతున్న ప్రేమకు తెరదించుతూ.. ఈ నెల 28వ తేదీన వీరిద్దరూ మూడు ముళ్ళ బంధంతో ఒక్కటవబోతున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 


ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ.. ‘దేవరాట్టం‘ చిత్రంలో నటించే సమయంలో తామిద్దరం స్నేహితులయ్యామని, ఆ తర్వాత ప్రేమికులుగా మారినట్టు చెప్పారు. మొదట తానే ప్రేమను వ్యక్తం చేసిందని, ఆ తర్వాత రెండు రోజుల పాటు భయంభయంగా గడిపి, ఆ విషయాన్ని మా ఇంటిలో చెప్పగా వారు కూడా అంగీకరించారని వివరించారు. అలా ఇరు కుటుంబ పెద్దల సమ్మతంతోనే ఈ నెల 28వ తేదీన పెళ్ళి చేసుకోబోతున్నామని, మున్ముందు కూడా మీ అందరి ఆశీస్సులు కావాలని కోరారు. (Date Fixed for Gautham Karthik-Manjima Mohan Marriage)

Updated Date - 2022-11-25T15:43:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!