సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Krithi Shetty : డేంజర్ బెల్స్ మోగుతున్నాయి..

ABN, First Publish Date - 2022-09-18T14:59:26+05:30

‘ఉప్పెన’ (Uppena) సంచలన విజయంతో కృతిశెట్టి (Krithishetty) క్రేజ్ పీక్స్‌కు చేరింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్‌లో ఆమెకు మేజర్ షేర్ ఇవ్వాలి. ఆమెను చూడ్డానికి యూత్ అంతలా ఎగబడ్డారు కాబట్టి ఆ క్రెడిట్ ఆమెకు ఇవ్వాల్సిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఉప్పెన’ (Uppena) సంచలన విజయంతో కృతిశెట్టి (Krithishetty) క్రేజ్ పీక్స్‌కు చేరింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్‌లో ఆమెకు మేజర్ షేర్ ఇవ్వాలి. ఆమెను చూడ్డానికి యూత్ అంతలా ఎగబడ్డారు కాబట్టి ఆ క్రెడిట్ ఆమెకు ఇవ్వాల్సిందే. ఈ ఒక్క సినిమాతో బేబమ్మను అవకాశాలు ఉప్పెనలా ముంచెత్తాయి. దానికి తగ్గట్టుగానే తదుపరి చిత్రాలు ‘శ్యామ్ సింగరాయ్ (Shyam Sigharoy), బంగార్రాజు (Bangarraju)’ కూడా మంచి సక్సెస్ సాధించాయి. కెరీర్ బిగినింగ్‌లోనే హ్యాట్రిక్ హిట్స్ దక్కాయి కాబట్టి, ఆమె డిమాండ్ కూడా మామూలుగా పెరగలేదు. ఆటోమేటిగ్గా రెమ్యూనరేషన్ కూడా బాగా పెరిగిపోయింది. అయితే ఎంత వేగంగా హ్యాట్రిక్ దక్కిందో అంతకన్నా స్పీడ్‌గా డిజాస్టర్స్ ఆమె తలుపు తడుతున్నాయి. ముచ్చటగా మూడు హిట్స్ దక్కాయన్న ఆనందం .. మూడు ఫ్లాప్స్‌తో ఆవివరయింది.  


రామ్ పోతినేని (Ram Pothineni) ఎంగిరి గంతేసి సెలెక్ట్ చేసుకొన్న కాప్ స్టోరీ ‘ది వారియర్’ (The Warrior), నితిన్ కెరీర్‌ను మలుపు తిప్పాల్సిన మాచర్ల నియోజకవర్గం (Macharla Niyojakavargam), సుధీర్ బాబు (Sudheer Babu) తెగ ఆశలు పెట్టుకున్న ‘ఈ  అమ్మాయిగురించి మీకు చెప్పాలి’ (Ee Ammayi Gurinchi Meeku Cheppali).. సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాకొట్టాయి. నిజానికి పెర్ఫార్మెన్స్ పరంగా ఇప్పటి వరకూ దొరికిన వాటిలో ఇందులోనే స్కోప్ ఎక్కువ. కానీ ఇంద్రగంటి అన్ని వర్గాల వారినీ మెప్పించడంలో విఫలమవడంతో ఇది కూడా ఫ్లాప్ దిశగానే పరుగులు పెడుతోంది. పబ్లిక్ టాక్ కానీ, రివ్యూలు కానీ ఏమాత్రం ఆశాజనకంగా లేవు. 


ప్రస్తుతం కృతి శెట్టి ఆశలన్నీ  చైతు - వెంకట్ ప్రభు (Chaitu - Venkata Prabhu), సూర్య - బాలా (Surya - Bala) కాంబో మూవీస్ పైనే ఉన్నాయి. ఇవి తీస్తున్న వారు రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్స్ కారు కాబట్టి పెద్ద బ్రేకే ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. అయితే ఈ రెండు సినిమాల్లోనైనా ఆమె పెర్ఫార్మెన్స్‌కు మంచి స్కోపుంటే.. ఆమెకు అవి చెప్పుకోదగ్గ సినిమాలు అవుతాయి. లేకపోతే ఈ సినిమాల సక్సెస్‌లో ఆమెకు ఎలాంటి క్రెడిటూ లేకుండా పోతుంది. అలా జరక్కుండా ఉండాలంటే.. ఈ రెండు సినిమాలు సూపర్ సక్సెస్ అవడంతో పాటు కృతి శెట్టికి మంచి పేరు తెచ్చిపెట్టాలి. మరి కృతి శెట్టి ఫేట్ ఎలా ఉంటుందో చూడాలి. 


Updated Date - 2022-09-18T14:59:26+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!