క్యూట్.. క్యూట్‌గా..!
ABN , First Publish Date - 2022-11-13T05:59:14+05:30 IST
ప్రముఖ కథానాయకుడు నాని సమర్పకుడిగా వ్యవహరించిన ఆంథాలజీ ‘మీట్ - క్యూట్’. దీప్తి గంటా దర్శకత్వం వహించారు...

ప్రముఖ కథానాయకుడు నాని సమర్పకుడిగా వ్యవహరించిన ఆంథాలజీ ‘మీట్ - క్యూట్’. దీప్తి గంటా దర్శకత్వం వహించారు. సత్యరాజ్, రోహిణి, ఆదాశర్మ, వర్ష బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, శివ కందుకూరి కీలక పాత్రలు పోషించారు. సోనీ లైవ్‌లో ఈ సిరీస్ త్వరలో ప్రసారం కానుంది. టీజర్‌ని శనివారం ఆవిష్కరించారు. టైటిల్‌కి తగ్గట్టు టీజర్ క్యూట్‌గా సాగిపోయింది. ఇదో ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ అనే విషయం టీజర్‌తో అర్థమైంది. ‘‘చిన్న చిన్న గొడవల వల్ల రిలేషన్ షిప్స్ ఫెయిల్ కావు.. ఫైట్ చేయడం ఆపేసినప్పుడే ఫెయిల్ అవుతాయి..’’ అంటూ సత్యరాజ్ చెప్పే డైలాగ్ టీజర్‌లో ఆకట్టుకొంటోంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. కెమెరా: వసంత్ కుమార్.