సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టైల్‌‪కు.. ఆ స్టార్‌ క్రికెటర్‌ ఫిదా!

ABN, First Publish Date - 2022-09-01T23:18:55+05:30

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Powerstar Pawan Kalyan) పేరు వింటే కొందరికీ పూనకాలు వస్తాయి. ఇంకొందరికి చెమటలు పడుతుంటాయి. మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi)కి తమ్ముడిగా సినీ అరంగేట్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Powerstar Pawan Kalyan) పేరు వింటే కొందరికీ పూనకాలు వస్తాయి. ఇంకొందరికి చెమటలు పడుతుంటాయి. మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi)కి తమ్ముడిగా సినీ అరంగేట్రం చేసిన కల్యాణ్‌.. ఆ తర్వాత తనకంటూ ఓ మార్క్‌ని, ప్రత్యేక గుర్తింపుని పొంది.. ఇప్పుడు పవర్‌స్టార్‌గా, ఇండస్ట్రీలో టాప్‌ హీరోగా ఎదిగాడు. ఈ జర్నీలో ఆయన మెరిపెంచిన మెరుపులు, ప్రదర్శించిన స్టైల్‌ విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌కి కారణమైంది. మొత్తంగా ఈరోజు ఆయన ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా మారిపోయాడు. ఒక్కోసారి రావడం లేటవ్వవచ్చేమో కానీ.. రావడం మాత్రం పక్కా.. అనేలా ఇప్పుడాయన పొలిటికల్‌ జర్నీ కూడా సాగుతుంది. ఒకవైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న పవన్‌ కల్యాణ్‌ గురించి ఇప్పుడొక మాజీ క్రికెటర్‌ చేసిన వ్యాఖ్యలు.. ఆయనని మరోసారి వార్తలలో నిలుపుతున్నాయి. ఇంతకీ ఎవరా క్రికెటర్‌? ఏమా కథ? అనేది తెలుసుకోవాలని ఉందా? అయితే విషయంలోకి వచ్చేద్దాం. 


విలక్షణ నటుడు చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) హీరోగా నటించిన చిత్రం 'కోబ్రా' (Cobra). ఈ చిత్రంతో స్టార్‌ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ (Irfan pathan) నటుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. ఇందులో ఆయన ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా నటించారు. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో తెలుగు హీరోలపై ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. ముఖ్యంగా పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ స్టైల్‌ అంటే తనకి ఎంతో ఇష్టమని, ఆయన సినిమాలు కూడా కొన్ని చూసినట్లుగా ఇర్ఫాన్‌ చెప్పుకొచ్చారు. అలాగే ‘పుష్ప’ (Pushpa) సినిమాలో అల్లు అర్జున్‌ (Allu Arjun) నటన కూడా తనని ఇంప్రెస్‌ చేసినట్లుగా తెలిపారు. ఎక్జయిట్‌ చేసే కంటెంట్‌తో ఉండే దక్షిణాది సినిమాలతో తను బాగా ఎంజాయ్‌ చేస్తున్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు. మొత్తంగా ఆయన నోటివెంట పవన్‌ కల్యాణ్‌ పేరు వినబడగానే.. ఆయన ఫ్యాన్స్‌ ఇర్ఫాన్‌ పఠాన్ పేరుతో సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నారు. క్రికెట్‌ ఆడే సమయంలో కూడా.. ఆయనికి ఇంత రీచ్‌ వచ్చి ఉండదు.. అంతలా ఈ విషయంలో ఇర్ఫాన్‌ పేరు మారుమోగుతోంది. అయితే ఆయన నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ‘కోబ్రా’ మాత్రం.. బాక్సాఫీస్‌ వద్ద కోరలు పీకిన తాచులా ప్రతాపం చూపించలేకపోయినట్లుగా టాక్ నడుస్తోంది. (Irfan pathan about Pawan kalyan)

Updated Date - 2022-09-01T23:18:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!