క్రియేటివ్‌గా Rangamarthanda లేటెస్ట్ వీడియో..

ABN , First Publish Date - 2022-07-08T16:26:24+05:30 IST

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna vamsi) దాదాపు నాలుగేళ్ల తరువాత తెరకెక్కిస్తున్న చిత్రం 'రంగ మార్తాండ' (Rangamarthanda). తాజాగా ఈ సినిమా నుంచి వీడియోను చిత్రబృందం వదిలింది.

క్రియేటివ్‌గా Rangamarthanda లేటెస్ట్ వీడియో..

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna vamsi) దాదాపు నాలుగేళ్ల తరువాత తెరకెక్కిస్తున్న చిత్రం 'రంగ మార్తాండ' (Rangamarthanda). తాజాగా ఈ సినిమా నుంచి వీడియోను చిత్రబృందం వదిలింది. మారాఠీలో విలక్షణ నటుడు నానా పటేకర్ Nana Patekar) నటించిన సూపర్ హిట్ 'నట సామ్రాట్' (Nata samrat) మూవీకిది అఫీషియల్ తెలుగు రీమేక్. ప్రకాష్ రాజ్ (Prakash Raj), రమ్యకృష్ణ (Ramyakrishna) ప్రధాన పాత్రల్లో బ్రహ్మానందం, శివానీ రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 


ఈ సినిమాను హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్ టైన్ మెంట్స్ పతాకాలపై కాలిపు మధు, ఎస్. వెంకటరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సాహిత్య లెజెండ్ స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. అలాగే, యువ రచయిత కాసర్ల శ్యామ్ కూడా పాటలు రాశారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. రంగస్థల కళాకారుడి జీవితంలో ఎదురైన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. 


ఈ నేపథ్యంలో మూవీ టైటిల్ లోగోని త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణవంశీ తాజాగా ఓ వీడియోతో పాటుగా పోస్టర్ ని విడుదల చేశారు. 'ఇది మన అమ్మానాన్నల కథ' అంటూ టైటిల్ లోగో లేకుండా ఓ పోస్ట్ ని సోషల్ మీడియాలో వదిలారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ఫొటోల పై భాగంలో కుడి ఎడమ చూస్తుండగా మధ్యలో టైటిల్ ప్లేస్ లో క్వోశ్చన్ మార్క్ సింబల్.. దానికింద రమ్యకృష్ణ ఫొటో కనిపిస్తుంది. ఇక వీడియోలోనూ రంగస్థల తెరని తీసి పోస్టర్ ని ప్రదర్శించడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. కాగా, త్వరలోనే 'రంగ మార్తాండ' టైటిల్ ని విడుదల చేయబోతున్నారు. Updated Date - 2022-07-08T16:26:24+05:30 IST

Read more