Crazy Fellow విడుదల తేదీ ఖరారు..

ABN , First Publish Date - 2022-07-08T20:03:13+05:30 IST

యంగ్ హీరో ఆది సాయికుమార్ (Adi Saikumar) నటిస్తున్న తాజా చిత్రాలలో ఒకటి 'క్రేజీ ఫెలో' (Crazy Fellow). ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది.

Crazy Fellow విడుదల తేదీ ఖరారు..

యంగ్ హీరో ఆది సాయికుమార్ (Adi Saikumar) నటిస్తున్న తాజా చిత్రాలలో ఒకటి 'క్రేజీ ఫెలో' (Crazy Fellow). ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు ఫణి కృష్ణ సిరికి (Fani KrshNa Siriki) దర్శకత్వం వహిస్తున్నాడు. దిగంగనా సూర్యవంశీ (Digangana Suryavanshi), మిర్నా మీనన్ (Mirnaa Menon) ఇందులో ఆది సరసన హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాను సెప్టెంబర్ 16, 2022 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ మేరకు తాజాగా విడుదల తేదీతో కూడుకున్న పోస్టర్‌ను మేకర్స్ వదిలారు.


ఇందులో హీరో ఆది చేతిలో గులాబీ పువ్వులతో, హీరోయిన్స్ దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ సీతాకోకచిలుక రెక్కలుగా కనిపించడం ఆకర్షణీయంగా ఉంది. ఈ పోస్టర్‌లో హీరోయిన్లిద్దరూ అందంగా కనిపిస్తుండగా, ఆది లుక్ స్టైలిష్ గా, ట్రెండీగా ఉంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై నిర్మాత కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీపై ఆది చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మధ్యకాలంలో తనకి సరైన హిట్ లేకపోవడంతో ఎలాగైనా ఈసారి గట్టి హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు.


చూడాలి మరి 'క్రేజీ ఫెలో' చిత్రం ఆదికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ మూవీకి ఆర్ఆర్ ధృవన్ సంగీతం సమకూరుస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా, ఈ యంగ్ హీరో చేతిలో 'అమరన్', 'కిరాతక', 'తీస్ మార్ ఖాన్', 'జంగిల్' చిత్రాలున్నాయి. ఇవన్నీ దాదాపు ఇదే ఏడాది రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలో ఏ రెండు హిట్ సాధించినా ఆది కెరీర్ ఇంకాస్త ఊపందుకుంటుందనడంలో సందేహం లేదు. 

Updated Date - 2022-07-08T20:03:13+05:30 IST