మాపై కుట్ర చేశారు

ABN , First Publish Date - 2022-05-23T05:39:23+05:30 IST

రాజశేఖర్‌ హీరోగా నటించిన చిత్రం ‘శేఖర్‌’. ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. అయితే ఆదివారం సాయంత్రం నుంచి ‘శేఖర్‌’ చిత్రం ప్రదర్శన అన్నిచోట్లా ఆగిపోయింది...

మాపై కుట్ర చేశారు

రాజశేఖర్‌ హీరోగా నటించిన చిత్రం ‘శేఖర్‌’. ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. అయితే ఆదివారం సాయంత్రం నుంచి ‘శేఖర్‌’ చిత్రం ప్రదర్శన అన్నిచోట్లా ఆగిపోయింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు థియేటర్ల యజమానులు సినిమా ప్రదర్శన నిలిపివేశారు. తమ సినిమా ప్రదర్శనలు నిలిచిపోవడంపై రాజశేఖర్‌ స్పందించారు. సినిమా ప్రదర్శన నిలిచిపోవడం తమకు ఎంతో బాధను కలిగించిందని ఆయన చెప్పారు. ‘శేఖర్‌’ సినిమాను పూర్తి చేసేందుకు చాలా కష్టపడ్డామని, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని ఆయన అన్నారు. కొందరు తమపై కుట్ర చేయడం వల్లే ఇలా జరిగిందని ఆయన ఆరోపించారు.  


కోర్టు ఆదేశాలు ఇచ్చింది

కోర్టు ఆదేశాలను అనుసరించి, ఆదివారం థియేటర్ల యజమాన్యం ‘శేఖర్‌’ ప్రదర్శనలను నిలిపివేసిందని ఫైనాన్షియర్‌ ఎం. పరంధామరెడ్డి తెలిపారు. తన దగ్గర జీవితా రాజశేఖర్‌ రూ. 65 లక్షలు అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో, కోర్టును ఆశ్రయించాన నీ, సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించడంలో జీవితా రాజశేఖర్‌ విఫలమైనందున ‘శేఖర్‌’ సినిమా ప్రదర ్శనలను నిలిపివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసిందని పరంధామరెడ్డి వివరించారు. 

Updated Date - 2022-05-23T05:39:23+05:30 IST

Read more