Ramcharan: సత్యతో రామ్‌చరణ్ ఫ్లైట్ జర్నీ!
ABN , First Publish Date - 2022-07-07T22:55:48+05:30 IST
రామ్ చరణ్ (Ram charan)తెరపైనే కాదు.. నిజజీవితంలో కూడా హీరో అని ఎన్నో సందర్భాల్లో నిరూపించుకున్నారు. గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే, ఆమె డెడ్ బాడీ తీసుకోవడానికి ఆసుపత్రికి చెల్లించడానికి డబ్బుల్లేకపోతే కాదంబరి కిరణ్, దర్శకుడు సుకుమార్ చొరవతో రాంచరణ్ రూ.2 లక్షలు సాయం అందజేశారు.

రామ్ చరణ్ (Ram charan)తెరపైనే కాదు.. నిజజీవితంలో కూడా హీరో అని ఎన్నో సందర్భాల్లో నిరూపించుకున్నారు. గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే, ఆమె డెడ్ బాడీ తీసుకోవడానికి ఆసుపత్రికి చెల్లించడానికి డబ్బుల్లేకపోతే కాదంబరి కిరణ్, దర్శకుడు సుకుమార్ చొరవతో రాంచరణ్ రూ.2 లక్షలు సాయం అందజేశారు. ‘మనం సైతం’ ద్వారా ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు. అవి కాక మరో 1,20,000/– పోగుచేసి చనిపోయినామె పాప పేరున డిపాజిట్ చేశారు. ఓ వేదికపై కాదంబరి కిరణ్ కనిపిస్తే ‘ఆ పాప ఎలా ఉంది కాదంబరి గారూ’ అని గుర్తు చేసుకుని తన మనసులు చాటారు చరణ్. తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు మెగా వారసుడు. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ (Shankar) దర్శకత్వంలో ‘ఆర్సీ15’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అమృత్సర్ లో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ చరణ్ సీన్స్ పూర్తి కావడంతో హైదరాబాద్‌కి తిరిగి రావాల్సి ఉంది. అదే సినిమాలో మరో పాత్ర పోషిస్తున్న సుపరిచిత కమెడియన్ సత్య సన్నివేశాల కూడా పూర్తి కావడంతో అతనూ హైదరాబాద్‌కి రావాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్, ఫ్లైట్ కోసం వేచి చూడడం ఎందుకని సత్యను తన సొంత విమానంలో హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధిత ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రామ్‌చరణ్ నటించిన ‘రంగస్థలం’లో సత్య ఓ పాత్రలో నటించారు. ఇప్పుడు చరణ్‌తో కలిసి ప్రయాణం చేసే అవకాశం అందుకున్నారు సత్య. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ‘చరణ్ గోల్డ్ స్పూన్‌తో కాదు గోల్డ్ హార్ట్‌తో పుట్టాడు’ అని కామెంట్లు పెడుతున్నారు. (Rc15 shooting in amritsar).
