Chiranjeevi: 6000 మంది విద్యార్థులు.. వాల్తేరు వీరయ్యగా..
ABN, First Publish Date - 2022-10-30T18:01:07+05:30
తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..
తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినీ పరిశ్రమలో ఎటువంటి సపోర్టు లేకుండా టాప్ హీరోగా మారారు. అప్పటి నుంచి ఆయన అభిమానులు పెరుగుతూ పోతున్నారు. అయితే.. రాజకీయాల కారణంగా కొన్నేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన చిరు.. మళ్లీ రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. ఇటీవలే ‘గాడ్ ఫాదర్’ (God Father) సినిమాతో సూపర్ హిట్ సాధించారు. ఆయన మరో చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ తరుణంలో చిరంజీవి మీద అభిమానాన్ని మల్లారెడ్డి మెనేజ్‌మేంట్ విద్యార్థులు వినూత్నంగా ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
దానికి.. ‘6000 మంది విద్యార్థులు తమ అభిమానాన్ని ఓ కళాఖండంగా మలిచి కోట్ల హృదయాలలో కొలువైన మెగాస్టార్ చిరంజీవి గారికి అందించిన అద్భుత దృశ్యకావ్యం’ అంటూ ఓ ఫ్యాన్ పేజీ ఆ వీడియోని అప్‌లోడ్ చేసింది.
ఆ పోస్ట్‌ని డైరెక్టర్ బాబీ షేర్ చేశారు. దానికి.. ‘ఇది మన మెగాస్టార్ చిరంజీవికి ఎంతో గొప్ప నివాళి. ఇది చిరంజీవి గారి మీద మల్లారెడ్డి కళాశాల విద్యార్థులు, యాజమాన్యానికి బాస్‌పై ఉన్న ప్రేమ, ఆప్యాయతని స్పష్టంగా చూపిస్తుంది. దీని నా టీం తరుఫున ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు. ఇది చూసిన ఎంతోమంది నెటిజన్లు దీనిపై స్పందిస్తూ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.