‘పద్మశ్రీ’ మొగిలయ్యను ఘనంగా సత్కరించిన సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2022-01-29T02:49:51+05:30 IST

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో తెలంగాణకు చెందిన కిన్నెర మొగిలయ్యను పద్మశ్రీ వరించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారం పొందిన మొగిలయ్యను తెలంగాణ సీఎం కేసీఆర్

‘పద్మశ్రీ’ మొగిలయ్యను ఘనంగా సత్కరించిన సీఎం కేసీఆర్

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలలో తెలంగాణకు చెందిన కిన్నెర మొగిలయ్యను పద్మశ్రీ వరించిన విషయం తెలిసిందే. ఈ పురస్కారం పొందిన మొగిలయ్యను తెలంగాణ సీఎం కేసీఆర్ ఘనంగా సత్కరించారు. ఆయనకు హైదరాబాద్‌లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం రూ.1 కోటి‌ని ఇవ్వనున్నట్లుగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. దర్శనం మొగిలయ్య శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనని సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించి.. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడన్నారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ.. కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు.Updated Date - 2022-01-29T02:49:51+05:30 IST