సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మహిళను బెదిరించిన నిర్మాత అరెస్టు

ABN, First Publish Date - 2022-04-26T13:46:43+05:30

తన వద్ద పనిచేసిన ఓ మహిళను పెళ్లి చేసుకోమంటూ బెదిరించిన సినీ నిర్మాత వరాహి (46)ను పోలీసులు అరెస్టు చేశారు. విరుగంబాక్కంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వరాహి భార్యతోపాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తన వద్ద పనిచేసిన ఓ మహిళను పెళ్లి చేసుకోమంటూ బెదిరించిన సినీ నిర్మాత వరాహి (46)ను పోలీసులు అరెస్టు చేశారు. విరుగంబాక్కంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వరాహి భార్యతోపాటు నివసిస్తున్నారు. అదే భవనంలో మరో ప్లాట్‌లో 31 యేళ్ళ మహిళ నివసిస్తోంది. ఆ మహిళ నిర్మాత వరాహి వద్ద కొన్నేళ్ళ క్రితం పనిచేసి ఆయన ప్రవర్తన సరిగా లేక మానేసింది. ఈ నేపథ్యంలో వరాహి ఆమె వద్దకు తరచూ వెళ్ళి తనను రెండో పెళ్ళి చేసుకోమని బలవంతపెట్టేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఇంటిలో ఒంటరిగా ఉన్న ఆ మహిళ వద్దకు వెళ్ళి తనను పెళ్ళిచేసుకోకపోతే హత్య చేస్తానని బెదిరించాడు. దీంతో దిగ్ర్భాంతి చెందిన ఆ మహిళ పోలీసు కంట్రోల్‌రూమ్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసింది. పోలీసులు వివరాలను నమోదు చేసుకుని వడపళని మహిళా పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ మేరకు వడపళని మహిళా పోలీసుస్టేషన్‌ పోలీసులు ఆ మహిళ వద్దకు వెళ్ళి విచారణ జరిపి నిర్మాత వరాహిని అరెస్టు చేశారు.

Updated Date - 2022-04-26T13:46:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!