సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

జగన్‌తో కీలక భేటీ.. చిరు రమ్మంటే కుదరదని చెప్పా: నాగార్జున

ABN, First Publish Date - 2022-01-13T19:39:57+05:30

ఏపీ ముఖ్యమంత్రిని కలవడానికి మెగాస్టార్ చిరంజీవి రమ్మంటే నాకు కుదరదని చెప్పానని ప్రముఖ నటుడు నాగార్జున వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రిని కలవడానికి మెగాస్టార్ చిరంజీవి రమ్మంటే నాకు కుదరదని చెప్పానని ప్రముఖ నటుడు నాగార్జున వెల్లడించారు. బంగార్రాజు సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నానన్నారు. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో రేట్లు తనకు సమ్మతమేనన్నారు. ‘జీవో రేట్లను క్యాలిక్యులేట్ చేసుకున్నాము. మాకు ధరలు ఓకే అనిపించాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనైనా సినిమాను రిలీజ్ చేయాలని ప్రమోషన్లు మొదలు పెట్టుకున్నాం’ అని నాగార్జున వెల్లడించారు.


గత కొన్ని రోజుల నుంచి ఏపీలో టికెట్ ధరలు సహా థియేటర్స్ వ్యవస్థకి సంబంధించిన విషయాలలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిల మధ్య కూడా ట్వీట్ల వార్ తర్వాత చర్చలు జరిపారు. అదే క్రమంలో టాలీవుడ్ పెద్దలు, నిర్మాతలు సహా హీరోలకి మరియు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నేతలకి మద్య చాలాసార్లు కీలక సమావేశాలు జరిగాయి. 


అయితే, ఇప్పటి వరకు సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఏపీలో టికెట్ ధరలు సహా చిత్రపరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చించేందుకు సమావేశం కానున్నట్టు తాజా సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో చిరంజీవి - సీఎం జగన్‌ల మధ్య చర్చలు జరగనున్నాయి. 


Updated Date - 2022-01-13T19:39:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!