కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న సినీ దర్శకుడు

ABN , First Publish Date - 2022-03-17T16:40:49+05:30 IST

చందనసీమకు చెందిన ప్రముఖ దర్శకుడు ఎస్‌ నారాయణ్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. నగరంలోని కేపీసీసీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటైన కార్యక్రమంలో

కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న సినీ దర్శకుడు

బెంగళూరు: చందనసీమకు చెందిన ప్రముఖ దర్శకుడు ఎస్‌ నారాయణ్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. నగరంలోని కేపీసీసీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటైన కార్యక్రమంలో ఆయనకు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ స్వయంగా స్వాగతం పలికారు. కన్నడసీమలో దాదాపు అందరు హీరోలతోనూ కలిసి పనిచేసి నారాయణ్‌ మార్గదర్శకత్వంలో రానున్న రోజుల్లో చందనసీమను అద్భుతంగా తీర్చిదిద్దుతామని డీకే శివకుమార్‌ ప్రటించారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కాంగ్రెస్‌లో చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజాసేవ కోసం, సినీ పరిశ్రమకోసం తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన ప్రకటించారు. యాదగిరి జిల్లా శహపురకు చెందిన రాష్ట్ర పీయూసీ ఉ పాధ్యాయుల సంఘం మాజీ అధ్యక్షుడు తిమ్మయ్య పుర్లె కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, శాసనసభలో ప్రతిపక్ష నేత సిద్దరామయ్య హాజరయ్యారు.

Updated Date - 2022-03-17T16:40:49+05:30 IST

Read more