సూపర్‌స్టార్ కృష్ణకు సినీ ప్రముఖుల అభినందనలు
ABN, First Publish Date - 2022-06-01T11:28:32+05:30
హీరో కృష్ణ పుట్టినరోజు కార్యక్రమం మంగళవారం ఉదయం ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగింది....
హీరో కృష్ణ పుట్టినరోజు కార్యక్రమం మంగళవారం ఉదయం ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగింది. ఆయన బావమరిది ఉప్పలపాటి సూర్యనారాయణబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మోహన్‌బాబు, నరేశ్, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాతలు అశ్వనీదత్, కె.ఎస్.రామారావు, ఆదిశేషగరిరావు, డాక్టర్ కె.ఎల్.నారాయణ, ఎన్.రామలింగేశ్వరరావు, మల్లికార్జునరావు, ఎస్.గోపాలరెడ్డి, టి.ప్రసన్న కుమార్, సాగర్, మోహన్ వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు. తన 80 పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్‌ను ఈ సందర్భంగా కట్ చేశారు. అంతకుముందు హీరో కృష్ణ ఇంట్లో అభిమానుల సమక్షంలో పుట్టిన రోజు వేడుక జరిగింది.