సూపర్‌స్టార్‌ కృష్ణకు సినీ ప్రముఖుల అభినందనలు

ABN , First Publish Date - 2022-06-01T11:28:32+05:30 IST

హీరో కృష్ణ పుట్టినరోజు కార్యక్రమం మంగళవారం ఉదయం ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగింది....

సూపర్‌స్టార్‌ కృష్ణకు సినీ ప్రముఖుల అభినందనలు

హీరో కృష్ణ పుట్టినరోజు కార్యక్రమం మంగళవారం ఉదయం ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో జరిగింది. ఆయన బావమరిది ఉప్పలపాటి సూర్యనారాయణబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మోహన్‌బాబు, నరేశ్‌, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాతలు అశ్వనీదత్‌, కె.ఎస్‌.రామారావు, ఆదిశేషగరిరావు, డాక్టర్‌ కె.ఎల్‌.నారాయణ,  ఎన్‌.రామలింగేశ్వరరావు, మల్లికార్జునరావు, ఎస్‌.గోపాలరెడ్డి, టి.ప్రసన్న కుమార్‌, సాగర్‌, మోహన్‌ వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు. తన 80 పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్‌ను ఈ సందర్భంగా కట్‌ చేశారు. అంతకుముందు హీరో కృష్ణ ఇంట్లో అభిమానుల సమక్షంలో పుట్టిన రోజు వేడుక జరిగింది. 


Updated Date - 2022-06-01T11:28:32+05:30 IST

Read more