సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Chor Bazaar సెన్సార్ పూర్తి..

ABN, First Publish Date - 2022-06-19T19:09:39+05:30

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) తనయుడు ఆకాష్ పూరీ (Akash Puri) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘చోర్ బజార్’ (Chor Bazaar).

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) తనయుడు ఆకాష్ పూరీ (Akash Puri) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘చోర్ బజార్’ (Chor Bazaar). తాజాగా ఈ మూవీకి సెన్సార్ పూర్తైంది. ఆకాష్ పూరీ చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి ‘బుజ్జిగాడు’, ‘చిరుత’, ‘గబ్బర్ సింగ్’, 'బిజినెస్ మ్యాన్' వంటి సినిమాలలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఆంధ్రా పోరీ’ _Andhra Pori) సినిమాతో హీరోగా మారాడు. ఆకాష్ నటించిన మొదటి సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దాంతో పూరీనే కొడుతో ‘మెహబూబా’ (Mehabooba) సినిమాను తీశారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది. 


ఎలాగైనా నెక్స్ట్ సినిమాతో హిట్ ఇవ్వాలనే పట్టుదలతో పూరి కథ, మాటలతో ‘రొమాంటిక్’ (Romantic) సినిమాను రూపొందించారు. పర్ఫార్మెన్స్ పరంగా ఆకాష్ బాగానే ఆకట్టుకున్నప్పటికీ సినిమా మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ మూవీతో హిట్ గ్యారెంటీ అనే ధీమాతో మాట్లాడు పూరీ, ఆయన కొడుకు. ఇండస్ట్రీ కూడా ఈ మూవీకి బాగా సపోర్ట్ చేసింది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆకాష్‌ను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి ప్రమోట్ చేశారు. అయినా ఆకాష్‌కు ‘రొమాంటిక్’ మూవీ హిట్ ఇవ్వలేదు.


ఈ క్రమంలో ఇప్పుడు ‘చోర్ బజార్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘జార్జ్ రెడ్డి’ (George Reddy) ఫేమ్ బి. జీవన్ రెడ్డి (B. Jeevan Reddy) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విభిన్నమైన కథా కథనాలతో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై బాగానే అంచనాలు పెంచింది. ఈ సినిమాను జూన్ 24న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘చోర్ బజార్’ యూ/ఏ సర్టిఫికెట్‌ను పొందింది. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ హిట్ అందుకుంటాడా లేదా చూడాలి. కాగా, ఈ మూవీలో ఆకాష్ సరసన గెహన సిప్పీ (Gehna Sippy) హీరోయిన్‌గా నటించింది. ఐ.వి ప్రొడక్షన్స్ (I V Productions) పతాకంపై వీఎస్ రాజు (V S Raju) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Updated Date - 2022-06-19T19:09:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!