సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Chiyan Vikram : నిలకడగానే ఆరోగ్యం

ABN, First Publish Date - 2022-07-08T20:31:13+05:30

కోలీవుడ్ చిత్ర పరిశ్రమ షాకయ్యే సంఘటన జరిగింది. స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు గుండె పోటు రావడంతో.. హుటాహుటిన ఆయననున చెన్నైలోని ఒక ఆసుపత్రిలో జాయిన్ చేశారు. తమిళంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన ఆయన తాజాగా ‘కోబ్రా’ అనే మూవీలో నటిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్ చిత్ర పరిశ్రమ షాకయ్యే సంఘటన జరిగింది. స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు గుండె పోటు రావడంతో.. హుటాహుటిన ఆయనను చెన్నై కావేరీ  ఆసుపత్రికి తరలించి ఐసీయూలో జాయిన్ చేశారు. తమిళంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన ఆయన తాజాగా ‘కోబ్రా’ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ క్రమంలో ఆయనకి హార్ట్ ఎటాక్ రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. నిజానికి ఆయనకి గుండె పోటు రాలేదని, హైఫీవర్ తో బాధపడుతున్నారని అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సినీ క్రిటిక్ రమేశ్ బాలా ట్వీట్ చేశారు. అలాగే.. కావేరీ ఆసుపత్రిలో విక్రమ్ చికిత్స తీసుకుంటున్నారని.. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపినట్లుగా సమాచారం. ఇటీవల కరోనా బారినపడిన విక్రమ్.. కోలుకుని ప్రస్తుతం షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు చెన్నైలో జరగాల్సిన తన రాబోయే చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’ టీజర్ లాంచ్‌కు విక్రమ్‌ హాజరు కావాల్సి ఉంది.  

Updated Date - 2022-07-08T20:31:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!