నిర్మాత ఎన్వీ ప్రసాద్ చేతిలో చియాన్ విక్రమ్ ‘Cobra’

ABN , First Publish Date - 2022-07-08T23:04:30+05:30 IST

ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). ఆయన హీరోగా నటించిన ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి అదే దారిలో విక్రమ్ చేసిన

నిర్మాత ఎన్వీ ప్రసాద్ చేతిలో చియాన్ విక్రమ్ ‘Cobra’

ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). ఆయన హీరోగా నటించిన ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి అదే దారిలో విక్రమ్ చేసిన చిత్రం ‘కోబ్రా’ (Cobra). ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 11న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోన్న ఈ చిత్ర తెలుగు రాష్ట్రాల హక్కులను  ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లో పేరుగాంచిన సీనియర్ నిర్మాత ఎన్వీ ప్రసాద్ (NV Prasad) సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తాజాగా నిర్మాత ఎన్వీ ప్రసాద్ ప్రకటించారు. 


‘కెజియఫ్’ (KGF) ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో.. చియాన్ విక్రమ్ గణితశాస్త్ర మేధావి పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఇండియన్ వెటరన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలపై చిత్రయూనిట్ దృష్టి పెట్టింది. త్వరలోనే టీజర్, ట్రైలర్‌లను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం.

Updated Date - 2022-07-08T23:04:30+05:30 IST

Read more