సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sita Ramam: ‘జాతిరత్నాలు’ చిట్టిని దించారు

ABN, First Publish Date - 2022-08-07T02:49:41+05:30

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా.. వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) సమర్పణలో స్వప్న సినిమా (Swapna Cinema) పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా.. వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) సమర్పణలో స్వప్న సినిమా (Swapna Cinema) పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ (Aswini Dutt) నిర్మించిన చిత్రం ‘సీతా రామం’ (Sita Ramam). హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’గా తెరకెక్కిన ఈ చిత్రం.. శుక్రవారం థియేటర్లలో విడుదలై విజయ దుందుభి మోగిస్తోంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ రష్మికా మందన్న (Rashmika Mandanna),  హీరో సుమంత్ (Sumanth), దర్శకులు గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్‌లు కీలక పాత్రలలో నటించారు. ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి అలాగే.. సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ చిత్రం ప్రశంసలను అందుకుంటోంది. ఈ చిత్రాన్ని.. ఇంకా జనాల్లోకి తీసుకువెళ్లేందుకు మేకర్స్ వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ‘జాతిరత్నాలు’ (Jathi Ratnalu) చిట్టిని వారు లైన్‌లోకి దింపారు.


స్వప్న సినిమా బ్యానర్‌పై రూపొందిన ‘జాతిరత్నాలు’ చిత్రం.. చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాలో చిట్టి పాత్రలో నటించిన హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah).. చక్కని నటనను కనబరిచి.. నటిగా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఇప్పుడా ఫరియా అబ్దుల్లా.. ‘సీతా రామం’ చిత్రంలో సీతగా నటించిన మృణాల్ ఠాకూర్‌ను ఇంటర్వ్యూ చేసింది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మేకర్స్ ప్లాన్ చేసిన ఈ ఇంటర్వ్యూ ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఇందులో ఫరియా ఎనర్జీ మాములుగా లేదు. ఇది ఇంటర్వ్యూలా కాకుండా.. ఆటపాటలతో నడిచింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే ఫుల్ వీడియోను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.



Updated Date - 2022-08-07T02:49:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!