సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Megastar chiranjeevi: సీతారామ్‌లకు చిరు ప్రశంస!

ABN, First Publish Date - 2022-08-28T22:09:44+05:30

వైజయంతి మూవీస్‌ సంస్థ నిర్మించిన ‘సీతారామం’ (Sitaramam)చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi wishes)చిత్ర బృందంపై పశంసల వర్షం కురిపించారు. చక్కటి ప్రేమకావ్యం చూసిన అనుభూతి కలిగిందని ఆయన అన్నారు. చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. ‘‘సీతారామం’ చూశాను. ఒక చక్కటి ప్రేమ కావ్యం చూసిన అనుభూతి కలిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైజయంతి మూవీస్‌ సంస్థ నిర్మించిన ‘సీతారామం’ (Sitaramam)చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi wishes)చిత్ర బృందంపై పశంసల వర్షం కురిపించారు. చక్కటి ప్రేమకావ్యం చూసిన అనుభూతి కలిగిందని ఆయన అన్నారు. చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. ‘‘సీతారామం’ చూశాను. ఒక చక్కటి ప్రేమ కావ్యం చూసిన అనుభూతి కలిగింది. విభిన్నమైన స్ర్కీన్‌ప్లేతో ఈ ప్రేమకథని ఆవిష్కరించిన  విధానం నాకెంతో నచ్చింది. సినీ ప్రేక్షకుల మనసుల పై చెరగని ముద్ర వేసే ఇలాంటి చిత్రాన్ని ఎంతో ఉన్నతమైన నిర్మాణ విలువలతో నిర్మించిన అశ్వనీదత్‌(Aswini dutt), స్వప్నాదత్‌, ప్రియాంకాదత్‌, ఒక ప్యాషన్‌తో చిత్రీకరించిన దర్శకుడు హను రాఘవపూడికి కలకాలం నిలిచే సంగీతం అందించిన విశాల్‌ చంద్రశేఖర్‌కి, అన్నింటికన్నా ముఖ్యంగా రామ్‌–సీతా పాత్రలకు ప్రాణం పోసిన మృణాల్‌ ఘాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌, సూత్రధారి పాత్ర పోషించిన రష్మిక మందన్న.. ఇతర నటీనటులు, సాంకేతిర నిపుణులకు నా శుభాకాంక్షలు. ప్రేక్షకుల మది దోచిన ఈ చిత్రం ఎన్నో అవార్డులను, రివార్డ్‌లను జాతీయ స్థాయిలో గెలవాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను’’ అని చిరంజీవి పేర్కొన్నారు. 







Updated Date - 2022-08-28T22:09:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!